Vaani Kapoor: ఎమోషనల్‌ బాండింగ్‌ అవసరం: హీరోయిన్‌

Vaani Kapoor Reveals Her Horse Riding For Shamshera Role - Sakshi

Vaani Kapoor Reveals Her Horse Riding Experience: బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్‌ హీరోయిన్ వాణీ కపూర్‌. నాని నటించిన 'ఆహా కల్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు కమర్షియల్ మూవీస్‌తోపాటు మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్‌లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన చిత్రం 'షంషేరా'. రణ్‌బీర్‌ కపూర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో సోనా అనే పాత్రలో అలరించనుంది వాణీ కపూర్. అయితే ఈ పాత్ర కోసం వాణీ కపూర్‌ స్పెషల్‌గా గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు తెలిపింది.

గుర్రపు స్వారీ నేర్చుకున్న అనుభవాలను 'షంషేరా' మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఇది నాకెంతో ఛాలేంజింగ్ పాత్ర. దీనికోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకున్నా. నా దృష్టిలో గుర్రాలు అత్యంత అందమైన జంతువులు. వాటికి ప్రేమ భాష మాత్రమే తెలుసు. స్వారీ నేర్చుకోవడానికి ముందు వాటితో సన్నిహితంగా ఉండటం, స్నేహం చేయడం, ఎమోషనల్‌ బాండింగ్‌ ఏర్పరచుకోవడం అవసరం. లేకపోతే అవి మనల్ని విసిరేస్తాయి. అందుకే శిక్షణ సమయంలో నేను వాటికోసం ఆహారం తీసుకొచ్చేదాన్ని. అలా వాటిని మచ్చిక చేసుకుని స్వారీ నేర్చుకున్నా.' అని తెలిపింది వాణీ కపూర్. 

కాగా కరణ్‌ మల్హోత్రా తెరకెక్కించిన 'షంషేరా' చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top