
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఇటీవలే రైడ్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో అజయ్ దేవగణ్ సరసన వాణి కపూర్ హీరోయిన్‌గా నటించింది. 2018లో వచ్చిన రైడ్ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కించారు.
అయితే పార్ట్-1లో హీరోయిన్‌గా ఇలియానా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైడ్-2లో ఇలియానాను ఎంపిక చేయకపోవడంపై డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా స్పందించారు. ఇలియానాను కాదని.. వాణి కపూర్‌ను ఎందుకు ఎంపిక చేశారన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఆమె జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. తాను ప్రస్తుతం ఓ బిడ్డతో పాటు మంచి కుటుంబం కలిగి ఉంది.. అంతేకాకుండా విదేశాలకు వెళ్లిపోయిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్లే హీరోయిన్‌ను మార్చాల్సి వచ్చిందని రాజ్ కుమార్ గుప్తా వెల్లడించారు.
కానీ ఇలియానాతో రైడ్ మూవీలో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపాకు. ఆమె ఎల్లప్పుడూ రైడ్ ప్రపంచంలో భాగమేనని రాజ్ కుమార్ గుప్తా అన్నారు. రైడ్- 2లో వాణి కపూర్ నటించడంపై ఎలాంటి వ్యతిరేకత లేదని దర్శకుడు పేర్కొన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే నటీనటుల మార్పులు తప్పనిసరని ఆయన వివరించారు. అంతకుముందు రైడ్ -2 ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఇలియానా స్థానంలో నటించే అంశాన్ని ప్రస్తావించగా.. మా మధ్య ఎటువంటి పోటీ లేదని వాణి కపూర్ స్పష్టం చేశారు.