breaking news
Raj Kumar Gupta
-
'ఇలియానాను ఎందుకు తీసుకోలేదంటే'.. రైడ్-2 డైరెక్టర్ క్లారిటీ!
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఇటీవలే రైడ్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో అజయ్ దేవగణ్ సరసన వాణి కపూర్ హీరోయిన్గా నటించింది. 2018లో వచ్చిన రైడ్ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే పార్ట్-1లో హీరోయిన్గా ఇలియానా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైడ్-2లో ఇలియానాను ఎంపిక చేయకపోవడంపై డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా స్పందించారు. ఇలియానాను కాదని.. వాణి కపూర్‌ను ఎందుకు ఎంపిక చేశారన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఆమె జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. తాను ప్రస్తుతం ఓ బిడ్డతో పాటు మంచి కుటుంబం కలిగి ఉంది.. అంతేకాకుండా విదేశాలకు వెళ్లిపోయిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్లే హీరోయిన్ను మార్చాల్సి వచ్చిందని రాజ్ కుమార్ గుప్తా వెల్లడించారు.కానీ ఇలియానాతో రైడ్ మూవీలో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపాకు. ఆమె ఎల్లప్పుడూ రైడ్ ప్రపంచంలో భాగమేనని రాజ్ కుమార్ గుప్తా అన్నారు. రైడ్- 2లో వాణి కపూర్ నటించడంపై ఎలాంటి వ్యతిరేకత లేదని దర్శకుడు పేర్కొన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే నటీనటుల మార్పులు తప్పనిసరని ఆయన వివరించారు. అంతకుముందు రైడ్ -2 ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఇలియానా స్థానంలో నటించే అంశాన్ని ప్రస్తావించగా.. మా మధ్య ఎటువంటి పోటీ లేదని వాణి కపూర్ స్పష్టం చేశారు. -
అబ్బా... ఆపుతారా ఇక మీ గోల!
‘రాజ్ కుమార్ గుప్తా థ్రిల్లర్ ఫిల్మ్ ‘సెక్షన్ 84’లో కరీనా కపూర్ నటించి ఉంటే... ఆమె కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడి ఉండేది’. ‘గ్లామర్ పాత్రలు చేయడం కంటే.. ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడంలోనే కథానాయికల నటనాప్రతిభ బయటపడుతుంది. సెక్షన్ 84 సినిమా ద్వారా కరీనాకు అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్ర వెదుక్కుంటూ వస్తే... పారితోషికం కోసం కాదనడం ఏ మేరకు సబబు?’.... ఇలా మీడియాలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ‘సెక్షన్ 84’లో మానసిక సమస్యతో బాధపడే వేశ్య పాత్రలో కరీనా నటించి ఉంటే ఎంత పేరు వచ్చి ఉండేదోగానీ... సినిమా నుంచి ఆమె తప్పుకోవడానికి అసలైన కారణం ఏమిటి అనేదాని గురించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు వినిపించిందేమిటంటే, ‘భజ్రంగి భాయ్‌జాన్’ సక్సెస్‌ను ఊహించి తన పారితోషికాన్ని అమాంతం పెంచేయడం వల్ల నిర్మాతలు చేతులెత్తేసి ‘‘మీరు నటించకపోయినా ఫరవాలేదు’’ అన్నారని! తాజాగా వినిపిస్తున్నదేమిటంటే, స్క్రిప్ట్ విషయంలో కరీనా అతి జోక్యం చేసుకోవడం వల్లే ఆమె సినిమా నుంచి తప్పుకోవాల్సివచ్చిందని. మొదట ఒకటి రెండు మార్పులకు దర్శకుడు ఓకే అన్నప్పటికీ... మార్పుల మీద మార్పులు చెప్పుకుంటూపోవడంతో విసుగెత్తిన డెరైక్టర్ రాజ్‌కుమార్ ‘స్కిప్ట్‌లో ఒక్క సీన్ కూడా మార్చేది లేదు’ అని ప్రకటించాడట. దీంతో బెబో అలిగి ‘సినిమా చేయనుగాక చేయను’ అందట. అంతేకాదు... ‘సెక్షన్ 84’ సినిమా గురించి ఎవరైనా అడిగితే చాలు...‘ఆపుతారా... మీ గోల’ అని మండిపడుతుందట!