
బాలీవుడ్ నటి వాణికపూర్ ప్రస్తుతం క్రేజీ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈనెల 25 నుంచి సందడి చేయనుంది. ఈ సిరీస్‌లో వాణీకపూర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని శతాబ్దాల కిందట చరణ్‌దాస్‌పూర్‌లో జరిగిన హత్యల నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించగా.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మించారు.
తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా వాణి కపూర్ కెరీర్ ప్రారంభంలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. కెరీర్ తొలినాళ్లలో ఎదురైన సవాళ్లను ప్రస్తావించింది. తాను కూడా బాడీ షేమింగ్కు గురైనట్లు వెల్లడించింది. తన స్కిన్ టోన్ కారణంగా ఓ సినిమాలో పాత్రకు రిజెక్ట్ చేశారని తెలిపింది. తాను చాలా సన్నగా ఉండటం వల్ల తరచుగా బాడీ షేమింగ్కు గురయ్యానని పేర్కొంది.
తాజా ఇంటర్వ్యూలో వాణి కపూర్ మాట్లాడుతూ.. 'కెరీర్ మొదట్లో తనను రిజెక్ట్ చేయడం.. తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఒక చిత్రనిర్మాత ఒకసారి నేను పాత్రకు న్యాయం చేయలేదని అన్నారు. తనను 'మిల్కీ వైట్'ని కాదని అన్నారు. ఆ విషయాన్ని తాను నేరుగా కాకపోయినా.. ఇతరుల ద్వారా తెలుసుకున్నా. తనపై ఎలాంటి కామెంట్స్ చేసినా తన గుర్తింపు, సామర్థ్యాలపై తనకు పూర్తిగా నమ్మకముంది. తాను సన్నగా ఉన్నానని.. బరువు పెరగాలని కొందరు సలహాలు ఇచ్చారు. కానీ నేనేంటో నాకు తెలుసు. నాలా ఉండటమే నాకిష్టం' అంటూ బాలీవుడ్ భామ చెప్పుకొచ్చింది. కాగా.. మండల మర్డర్స్ సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా, శ్రియా పిల్గావ్‌కర్, జమీల్ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటించారు.