కుష్లు, నమ్రిత.ఎంవీ, రెహమాన్, తనూజ పుట్టుస్వామి ప్రధాన పాత్రధారులుగా అనూష్ గోరక్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. కేఏ ప్రొడక్షన్స్ , పౌర్ణమి ఎంటర్‌టైన్ మెంట్స్‌పై కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు. వై నిర్మాతలు. సోమవారం ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘ఇలాంటి కథను మీరు ఇప్పటి దాకా తెరపై చూసి ఉండరు. ఇలాంటి జానర్‌ను మీరు (ప్రేక్షకులను ఉద్దేశించి కావొచ్చు) ఊహించలేరు’ అనే క్యాప్షన్స్ ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్‌పై ఉన్నాయి. జేసిన్ జార్జ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వినీల సాహిత్య, కుష్లు సహ–నిర్మాతలు.


