గ్యారంటీ ఇచ్చేసి వెళ్లు నాన్నా | Darling Krishna and Prakash Raj Father Movie Teaser Release | Sakshi
Sakshi News home page

గ్యారంటీ ఇచ్చేసి వెళ్లు నాన్నా

Aug 26 2026 3:56 AM | Updated on Aug 26 2026 3:56 AM

Darling Krishna and Prakash Raj Father Movie Teaser Release

ప్రకాష్‌రాజ్, కృష్ణ

తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన సినిమా ‘ఫాదర్‌’. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, డార్లింగ్‌ కృష్ణ తండ్రీ కొడుకులుగా నటించగా, అమృత అయ్యంగార్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఆర్‌సీ స్టూడియోస్‌ పతాకంపై ఆర్‌. చంద్రు, యమున చంద్రశేఖర్, ఆనంద్‌ పండిట్‌ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘కృష్ణా... మరొక జన్మనేది ఉంటే మళ్లీ నేను నీకు తండ్రిగానే పుడతాను’, ‘వచ్చే జన్మలో కలుస్తానని లెటర్‌లో రాశావు కదా... వచ్చే జన్మలోనూ నువ్వే నాన్నగా ఉంటావని గ్యారంటీ ఇచ్చేసి వెళ్లు నాన్నా..’ అన్న డైలాగ్స్‌ ఈ సినిమా టీజర్‌లో ఉన్నాయి. నాగభూషణ ఎస్‌ఎస్, రమేష్‌ ఇందిర, అవినాష్, హొన్నవల్లి కృష్ణ, గగన్‌ బీఏ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: నకుల్‌ అభ్యంకర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement