బిహార్ ఎమ్మెల్యే అనంత సింగ్ (అలియాస్ 'ఛోటే సర్కార్') కుమార్తె వివాహం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ సినిమా లేదా టీవీ సీరియల్‌ను తలపించేంత వైభవంగా జరగనున్న ఈ వివాహం, నవంబర్ 25న పాట్నాలోని ఆయన పూర్వీకుల గ్రామమైన 'లడ్మా'లో జరగనుంది. కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ వెడ్డింగ్ విశేషాలు నెట్టింట సందడిగా మారాయి. ముఖ్యంగా భారీ టెంట్లు, మెగా కిచెన్, హైవే పక్కనే హెలిప్యాడ్, రక రకాల వంటకాలు అబ్బో ఈ లిస్ట్ చాలా పెద్దదే. ముఖ్యంగా ఆసక్తికరంగా గుర్రపు పందెం కూడా జరగనుంది. ఇందులో గెలిచిన వారికి బహుమతిగా ''మహీంద్రా థార్' (Thar) కారును అందించ నుండటం మరో విశేషం.
4 లక్షల మంది అతిథులు, అల్లుడికి రూ. 3.5 కోట్ల విలువైన 'డిఫెండర్' కారు
అనంత సింగ్ చిన్న కుమార్తె శివాంగి, కమాండెంట్ రణవిజయ్ కుమార్ కుమారుడు రిషికేష్ కుమార్‌ను వివాహం చేసుకోనున్నారు.ఈ వివాహ వేడుకకు సుమారు నాలుగు లక్షల మంది అతిథులు హాజరవుతారని అంచనా. అనేక ఎకరాల విస్తీర్ణంలో భారీ పండాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, హెలికాప్టర్లలో వచ్చే వీఐపీ అతిథుల కోసం వేదిక సమీపంలో హెలిప్యాడ్‌లు సిద్ధమవుతున్నాయి.
అంతేకాదు తిలక్ వేడుకలో అనంత్ సింగ్ తన కాబోయే అల్లుడు రిషికేశ్ కుమార్‌కు సుమారు రూ. 3.5 కోట్ల విలువైన 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' (Land Rover Defender) కారును బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించి హల్దీ వేడుక కూడా వైభవంగా జరుగుతోంది. 100 అడుగులకు పైగా పొడవైన టెంట్‌లో ఏర్పాటు చేసిన మెగా కిచెన్‌లో 50 లక్షలకు పైగా గులాబ్ జామూన్లు తయారు చేస్తున్నారు.ఈ వేడుక కోసం ప్రకాశవంతమైన పసుపు రంగు కుర్తాలు ధరించిన అనంత్ సింగ్ ముగ్గురు కుమారులు అంకిత్, అభిషేక్, అభినవ్ అతిథులకు స్వాగతం పలుకుతున్నారు.
ఉత్తర భారతదేశ వేడుకల్లో తప్పనిసరిగా ఉండే గులాబ్ జామూన్లు భారీ స్థాయిలో పెద్ద పెద్ద పాత్రల్లో ఉంచిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. రాబోయే రెండు రోజుల్లో రానున్న అతిథులకు వంట చేయడానికి ఇలాంటి మరో 12 టెంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు అనంత్ సింగ్ సన్నిహితుడు కన్హయ్య సింగ్ ఎన్డీటీవీకి తెలిపారు. స్వీట్ల తయారీ కోసం 10,000 కిలోల ట్యాంకర్ల ద్వారా పాలను నేరుగా మెగా కిచెన్‌కు తరలిస్తున్నారు.
చాలా సంతోషం
ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇంటికి వస్తున్నారు, అతిథులందరిన్నీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం అంటూ ఈ భారీ వేడుక పట్ల అనంత్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కుమార్తె వివాహ ఏర్పాట్ల మధ్య భావోద్వేగానికి లోనైన గుర్రపు పందెం
వర్షం కారణంగా మైదానం బురదమయంగా మారిందని, అయితే పెళ్లిలో ప్రధాన ఆకర్షణ గుర్రపు పందెం కోసం దానిని సిద్ధం చేసే పనులు జరుగుతున్నాయని కన్హయ్య పేర్కొన్నారు. పందెం కోసం మైదానాన్ని చదును చేస్తున్నామని, అతిథులకు స్వాగతం పలికేందుకు కొత్తగా నిర్మించిన మార్గాలకు మరమ్మతులు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇక్కడ నిర్వహించబోయే గుర్రపు పందెం అశ్వప్రేమికులను ఎంతగానో ఆకర్షించనుంది. ఒకేసారి పైకి ఎత్తే గుర్రాల ప్రత్యేక నడక (gait) ఈ పోటీలో అత్యంత ఆకర్షణీయమైన దృశ్యాన్ని తిలకించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గుర్రపు పందెం కోసం రెండు రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. వివాహం రోజున జరగనున్న ఈ పందెం కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక జాతి గుర్రాలు ఇక్కడకు చేరుకుంటున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సుశీల్ సింగ్ వేదిక వద్దకు చేరుకోగా, అనంత్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. "అనంత్ సింగ్ నాకు సోదరుడి లాంటివారు. ఆయన కుమార్తె వివాహం కావడంతో నా ఆశీస్సులు అందించడానికి వచ్చాను" అని సుశీల్ అన్నారు. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి అనంత్ సింగ్‌ను ఆహ్వానిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.
అక్వాన్ దెబ్బ
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుపాను కారణంగా బీహార్‌లోని వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీనివల్ల పూర్నియా, పాట్నా, ముంగేర్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శీతాకాలంలో అకస్మాత్తుగా కురుస్తున్న ఈ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనాన్ని ప్రభావితం చేశాయి. దీనివల్ల నాద్వాన్ గ్రామంలో జరుగుతున్న అనంత్ సింగ్ కుమార్తె వివాహ ఏర్పాట్లకు అంతరాయం కలిగింది. అయితే అంగరంగ వైభవంగా పెళ్లి తంతును నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్న తరుణంలో, 'అక్వాన్' (Akvan) తుపాను మోకామా ఎమ్మెల్యే అనంత సింగ్‌ను ఆందోళనకు గురిచేసింది. అయినా తగ్గేదేలే అన్నట్టు ఏర్పాట్లను చకా చకా నిర్వహిస్తున్నారు. రూ.150 కోట్లకు పైగా వ్యయంగా భావిస్తున్న ఈ వెడ్డింగ్ దేశవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది.


