శివాజీనగర(కర్ణాటక): కేపీఎస్‌సీ ఉద్యోగాల కుంభకోణంలో ఆరోపణలు వచ్చిన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్రకుమార్ ఆచూకీ దొరకలేదు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు బెంగళూరు జయమహల్ రోడ్డులోని ఆయన ఇంటి తలుపులు బద్ధలు కొట్టి సోదాలు నిర్వహించారు. ముఖ్యమైన పత్రాలు, కంప్యూటర్ తదితరాలను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిసింది. జ్ఞానేంద్రకుమార్ కేపీఎస్‌సీలో ఎగ్జామ్ కంట్రోలర్‌గా పనిచేశారు.
ఆయన ఆధ్వర్యంలో పశు వైద్యాధికారులు, కేఏఎస్ పరీక్షలు కూడా నిర్వహించారు. కేఏఎస్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఓ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈడీ సోదాలు మొదలుకాగానే జ్ఞానేంద్రకుమార్ జాడ లేకుండా పోయారు. ఆగస్టు 20న మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు విమానం టికెట్ తీసుకున్నారు. కానీ గంటన్నర ముందుగానే రూ.30,253 చెల్లించి హడావుడిగా మరో విమానం టికెట్ తీసుకుని వెళ్లిపోయారని తెలిసింది.


