అమరావతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నవజాత శిశువులు మృతి | New borns Burnt To Death After Fire At Maharashtra Amravati Hospital | Sakshi
Sakshi News home page

అమరావతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నవజాత శిశువులు మృతి

Aug 24 2026 7:38 AM | Updated on Aug 24 2026 7:47 AM

New borns Burnt To Death After Fire At Maharashtra Amravati Hospital

ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అమరావతిలోని జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం ఘటన జరిగింది. ఈ ప్రమాదం కారణంగా ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు. మరికొందరు శిశువుల పరిస్థితిపై ఆందోళన కొనసాగుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ మహిళా ఆసుపత్రి మూడో అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. వెంటిలేటర్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమై NICUలో ఉన్న శిశువులను బయటకు తరలించారు.

ఇది కూడా చదవండి: హెచ్‌1ఎన్‌1 టెన్షన్‌.. ఒక్కరోజే 114 పాజిటివ్‌ కేసులు

ఆ సమయంలో NICUలో 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సిబ్బంది సకాలంలో స్పందించి పలువురు శిశువులను సురక్షితంగా బయటకు తరలించారు. తీవ్ర వైద్య సంరక్షణ అవసరమైన ఆరుగురు శిశువులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితిపై ఆందోళన కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఆగస్టు 22న మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లా ఆసుపత్రిలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. NICUలోని వార్మర్ యంత్రం నుంచి మంటలు చెలరేగడంతో ఓ నవజాత శిశువు మృతి చెందగా, మరో ఇద్దరు శిశువులు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement