సాక్షి,కాకినాడ: ఓ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని ఫోన్ మాయమైంది. అంతే సదరు హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులు మధ్య మధ్య మాట మాట పెరిగింది. చేతికి అందిన బకెట్లు,కర్రలు,చెప్పులు ఏది దొరికితే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఫలితంగా విద్యార్థునుల సమస్యను పరిష్కరించాలని మాజీ సీఎం ట్వీట్ చేశారు. జిల్లా ఐఏఎస్, ఎస్పీ వంటి ఉన్నత స్థాయి పోలీస్ శాఖ అధికారులు హుటాహుటీన పరుగులు పెట్టారు.
పోలీసుల వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని ఓ మహిళా నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో మొబైల్ ఫోన్ మాయమవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆగస్టు 21న హాస్టల్‌లో ఉంటున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ విద్యార్థినికి సంబంధించిన ఫోన్ కనిపించకుండాపోవడంతో ఈ వివాదం ప్రారంభమైంది.
ఘర్షణకు దారితీసిన పరిస్థితులు
ఫోన్ పోవడానికి స్థానిక విద్యార్థులే కారణమనే అనుమానంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చి, తెలుగు విద్యార్థినులకు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులకు మధ్య వాగ్వాదానికి, ఘర్షణకు దారితీసింది. హాస్టల్ క్యాంపస్‌లో చేతికి ఏది దొరికితేదాన్ని విసురుకుంటూ పరస్పరం దాడులకు దిగడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో కొందరు విద్యార్థినులు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఉన్నతాధికారుల జోక్యం
ఘటన తీవ్రత పెరగడంతో మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ సైతం స్పందించి, విద్యార్థినుల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని ట్విట్టర్ వేదికగా కోరారు. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉండటంతో జిల్లా కలెక్టర్ (ఐఏఎస్) పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) తక్షణమే రంగంలోకి దిగారు.
సమస్య పరిష్కారం
జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు హుటాహుటీన హాస్టల్‌ను సందర్శించి, ఇరు వర్గాల విద్యార్థినులతో మాట్లాడి శాంతియుతంగా సమస్యను పరిష్కరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా, భద్రతా చర్యల్లో భాగంగా ఈశాన్య ప్రాంత విద్యార్థినులకు ప్రత్యేక వసతిని కల్పించారు.
BREAKING ⚡
🚨NORTHEAST STUDENTS ATTACKED BY MOB AT SK COLLEGE OF NURSING, ANDHRA PRADESH @AndhraPradeshCM
22 August 2026
📍Valasapakala, Kakinada
—A scuffle reportedly broke out between Northeast and local girl students following allegations of stolen mobile phones… pic.twitter.com/HN8X6ZfRsW— 📍SHANGH CHE🚭 (@JosephNaga1986) August 22, 2026


