ది సైలెంట్‌ గార్డియన్‌ | Rahul Gandhi Turns Real-Life Batman In Delhi Posters | Sakshi
Sakshi News home page

ది సైలెంట్‌ గార్డియన్‌

Aug 24 2026 5:51 AM | Updated on Aug 24 2026 5:51 AM

Rahul Gandhi Turns Real-Life Batman In Delhi Posters

ఇదేదో ఇంగ్లిష్‌ సినిమా పేరు కాదు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం సమీపంలో ఏర్పాటైన పోస్టర్ల ట్యాగ్‌ లైన్‌. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని ‘రియల్‌ లైఫ్‌ బ్యాట్‌ మ్యాన్‌’గా చిత్రీకరిస్తూ పోస్టర్లు వెలిశాయి. కోట్లా మార్గ్‌లోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్‌’ ప్రవేశ ద్వారం, 24 అక్బర్‌ రోడ్‌ పార్టీ కార్యాలయం వెలుపల, రైసినా రోడ్‌లోని ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ కార్యాలయం సమీపంలో ఈ  పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అక్షయ్‌ లక్రా ఈ పోస్టర్లు ఏర్పాటు చేయించారు. 

రాహుల్‌ గాంధీ ఈ నెలారంభంలో ఇన్‌స్టాగ్రామ్‌లో విద్యార్థులు, యువతతో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌లో పాల్గొన్నారు. విద్యార్థులు, యువత అడిగిన ప్రశ్నలకు సమాధాన మిచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి సరదాగా ‘మీరు బ్యాట్‌ మ్యానా?’ అని ప్రశ్నించారు. దీనికి రాహుల్‌ గాంధీ ‘నన్ను, బ్యాట్‌ మ్యాన్‌ను ఒకే గదిలో ఎవ్వరూ, ఎప్పుడూ చూడలేదు అనుకుందాం’ అని బదులిచ్చారు. తాను నిజంగా బాట్‌ మ్యాన్‌ అని చెప్పకుండా, ‘నేను, బ్యాట్‌మాన్‌ ఒకేసారి ఒకే కనిపించలేదు కదా’ అని బ్యాట్‌మ్యాన్‌ సినిమాలోని సీక్రెట్‌ ఐడెంటిటీ కాన్సెప్ట్‌తో సమాధానమిచ్చారు. దీంతో ఈ బ్యాట్‌మ్యాన్‌ పోలిక ట్రెండయ్యింది. ఇప్పుడు ఏకంగా పోస్టర్లే వెలిశాయి. దీంతో సోషల్‌ మీడియా వేదికగా సానుకూలంగా, ప్రతికూలంగా చర్చ ఆరంభమైంది.                 

–న్యూఢిల్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement