breaking news
Akbar road
-
ది సైలెంట్ గార్డియన్
ఇదేదో ఇంగ్లిష్ సినిమా పేరు కాదు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం సమీపంలో ఏర్పాటైన పోస్టర్ల ట్యాగ్ లైన్. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ‘రియల్ లైఫ్ బ్యాట్ మ్యాన్’గా చిత్రీకరిస్తూ పోస్టర్లు వెలిశాయి. కోట్లా మార్గ్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రవేశ ద్వారం, 24 అక్బర్ రోడ్ పార్టీ కార్యాలయం వెలుపల, రైసినా రోడ్‌లోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ చీఫ్ అక్షయ్ లక్రా ఈ పోస్టర్లు ఏర్పాటు చేయించారు. రాహుల్ గాంధీ ఈ నెలారంభంలో ఇన్‌స్టాగ్రామ్‌లో విద్యార్థులు, యువతతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో పాల్గొన్నారు. విద్యార్థులు, యువత అడిగిన ప్రశ్నలకు సమాధాన మిచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి సరదాగా ‘మీరు బ్యాట్ మ్యానా?’ అని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ ‘నన్ను, బ్యాట్ మ్యాన్‌ను ఒకే గదిలో ఎవ్వరూ, ఎప్పుడూ చూడలేదు అనుకుందాం’ అని బదులిచ్చారు. తాను నిజంగా బాట్ మ్యాన్ అని చెప్పకుండా, ‘నేను, బ్యాట్‌మాన్ ఒకేసారి ఒకే కనిపించలేదు కదా’ అని బ్యాట్‌మ్యాన్ సినిమాలోని సీక్రెట్ ఐడెంటిటీ కాన్సెప్ట్‌తో సమాధానమిచ్చారు. దీంతో ఈ బ్యాట్‌మ్యాన్ పోలిక ట్రెండయ్యింది. ఇప్పుడు ఏకంగా పోస్టర్లే వెలిశాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా సానుకూలంగా, ప్రతికూలంగా చర్చ ఆరంభమైంది. –న్యూఢిల్లీ -
రాత్రికి రాత్రే రోడ్డు పేరును మార్చేశారు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రఖ్యాత అక్బర్ రోడ్డు పేరును రాత్రికి రాత్రే మార్చేశారు. పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ అధినేత అమిత్ షా నివాసాలు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డు పేరును మార్చాలనే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇంతలోనే మంగళవారం రాత్రి ఎవరో ఇండియాగేట్ సర్కిల్‌కు వెళ్లే మార్గంలో అక్బర్ రోడ్డు దారిని చూపించే బోర్డుపైనా.. అక్బర్ బోర్డు కనిపించడకుండా.. మహారాణా ప్రతాప్ రోడ్డు అంటూ రాసి.. పోస్టర్ అతికించారు. అక్బర్ రోడ్డు మార్గాన్ని సూచించే ప్రధాన సూచికపై పేరును మార్చి.. మహారాణా ప్రతాప్ రోడ్డు అని రాయడం స్థానికంగా గందరగోళం సృష్టించింది. ఎవరూ ఈ చర్యకు పాల్పడ్డారన్నది ఇంకా స్పష్టం కాలేదు. కానీ బుధవారం (మే 9) మేవార్ రాజ్‌పుత్ వీరుడు మహారాణా ప్రతాప్ జయంతి కావడంతో ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. బుధవారం ఆ పోస్టర్‌ను తొలగించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. -
చిరంజీవి ఇంటికి నోటీసులు!
న్యూఢిల్లీః యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక నివాసాన్ని తక్షణం ఖాళీచేయాలని ఎస్టేట్ డెరైక్టరేట్ అధికారులు అక్బర్ రోడ్డులోని 17వ నెంబరు ఇంటికి నోటీసులు అంటించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి ఇదే నివాసంలో కొనసాగాలని భావించినప్పటికీ, మంత్రులకు కేటాయించాల్సిన ఈ క్వార్టర్‌ను ఎంపీకి కేటాయించలేమని అధికారులు తేల్చిచెప్పారు. జూన్ 27వ తేదీ నాటికే గడువు ముగిసిందని గతంలోనే అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికీ ఖాళీ చేయకపోవడంతో తక్షణం ఖాళీ చేయాలంటూ ఆ ఇంటికి నోటీసులు అంటించారు. **


