చిరంజీవి ఇంటికి నోటీసులు! | Notices to Chiranjeevi home! | Sakshi
Sakshi News home page

చిరంజీవి ఇంటికి నోటీసులు!

Nov 13 2014 7:46 PM | Updated on Sep 2 2017 4:24 PM

చిరంజీవి

చిరంజీవి

యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక నివాసాన్ని తక్షణం ఖాళీ చేయాలని ఎస్టేట్ డెరైక్టరేట్ అధికారులు అక్బర్ రోడ్డులోని 17వ నెంబరు ఇంటికి నోటీసులు అంటించారు.

 న్యూఢిల్లీః యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక నివాసాన్ని తక్షణం ఖాళీచేయాలని ఎస్టేట్ డెరైక్టరేట్ అధికారులు అక్బర్ రోడ్డులోని 17వ నెంబరు ఇంటికి నోటీసులు అంటించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి ఇదే నివాసంలో కొనసాగాలని భావించినప్పటికీ, మంత్రులకు కేటాయించాల్సిన ఈ క్వార్టర్‌ను ఎంపీకి కేటాయించలేమని అధికారులు తేల్చిచెప్పారు.

జూన్ 27వ తేదీ నాటికే గడువు ముగిసిందని గతంలోనే అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికీ ఖాళీ చేయకపోవడంతో తక్షణం ఖాళీ చేయాలంటూ ఆ ఇంటికి నోటీసులు అంటించారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement