‘ఆటో జానీ’గా చిరంజీవి.. అంచనాలు పెంచేసిన ‘కాకా’ | Chiranjeevi Brings Back Auto Johnny Avatar, Kaaka New Poster Goes Viral | Sakshi
Sakshi News home page

‘ఆటో జానీ’గా చిరంజీవి.. కొత్త పోస్టర్‌తో అంచనాలు పెంచేసిన ‘కాకా’

Nov 29 2026 12:52 PM | Updated on Nov 29 2026 12:55 PM

Chiranjeevi Brings Back Auto Johnny Avatar, Kaaka New Poster Goes Viral

విశ్వంభర, కాకా.. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఈ రెండు చిత్రాలలో ఏది సంక్రాంతికి వస్తుందనేదానిపై స్పష్టత వచ్చింది. ‘కాకా’నే ఈ పండక్కి రాబోతున్నాడని మెగాస్టార్‌  చిరంజీవి మరోసారి స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది జనవరి 13న కాకా ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మెగాస్టార్‌ చిరంజీవి ఎక్స్‌ వేదికగా కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేశాడు.

ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల్లో చిరంజీవిని ఆక్వా కంపెనీ సూపర్‌ వైజర్‌  సత్యంగా చూపించారు. కొత్త పోస్టర్‌లో మాత్రం ఆటో జానీగా ఊరమాస్‌  లుక్‌లో చిరంజీవి కనిపించాడు. ‘ఆటో జానీ గుర్తున్నాడా?  ఈ సంక్రాంతికి సరికొత్తగా ‘కాకా’లో మీ ముందుకు వస్తున్నాడు’ అంటూ చిరంజీవి ట్వీట్‌ చేయడంతో క్షణాల్లో కొత్త పోస్టర్‌  వైరల్‌అయిపోయింది.

ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత ఎన్టీఆర్‌.. సీక్వెల్స్‌తో ప్రభాస్‌

ఆటో జానీ పేరు చెప్పగానే మెగాస్టార్‌  ఫ్యాన్స్‌కి వెంటనే రౌడీ అల్లుడు సినిమా గుర్తొస్తుంది. అందులో చిరంజీవి పోషించిన పాత్ర పేరు ఆటో జానీ. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ పేరుని రిపీట్‌  చేయడం చూస్తుంటే.. దర్శకుడు బాబీ కొల్లి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇది కచ్చితంగా ప్లాష్‌బ్యాక్‌  ఎపిసోడ్‌కి సంబంధించిన లుక్‌  కావొచ్చు. ఈ సినిమాలో చిరు మూడు షేడ్స్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సత్యం లుక్‌  వచ్చేసింది. ఇప్పుడు ఆటో జానీ వచ్చేశాడు. అసలైన కదిరి కాళిదాస్ ని ఇంకా రివీల్ చేయలేదు. రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు ఆ లుక్‌ ని కూడా వదులుతారేమో. ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా అనస్వర రాజన్‌  నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement