కికు యనమల, కశిష్ ఖాన్ ప్రధాన పాత్రల్లో సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ కికు చిరంజీవి. ఈ సినిమాకు శుభ సాయివెంకట్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని దీప్తి నడిమింటి నిర్మించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు హీరో కికు యనమల తమ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆంధ్రాలో కూడా పేరున్న కాలేజీల్లో నా మూవీ ప్రమోషన్ చేసుకున్నానని వెల్లడించారు. నా వల్ల సాధ్యమైనంత వరకు మూవీ ప్రమోషన్స్ చేస్తున్నానని తెలిపారు.
కానీ హైదరాబాద్‌లో మాత్రం పేరు మోసిన కాలేజీ ప్రమోషన్ ఈవెంట్ కోసం అనుమతి అడిగితే కనీసం స్పందించలేదని హీరో యనమల ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పర్మిషన్ ఇస్తామని చెప్పి.. తర్వాత రెస్పాండ్ కాలేదన్నారు. ఆ పెద్దాయన ఓ పెద్ద సినిమా కోసం స్టేజ్ మీద నిలబడి నేను పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడ్డా అని చెప్పుకునే వ్యక్తికి మా కష్టం కనిపించలేదా? అని హీరో ప్రశ్నించారు. ఒక సినిమా కోసం 75,000 మందిని ఆర్గనైజ్ చేశారు కానీ.. నా సినిమా కోసం కూడా కనీసం 700 మందిని ఆర్గనైజ్ చేసి ఉంటే.. చాలా హెల్ప్ అయ్యేదని అన్నారు.
పోస్టర్స్ తీసేశారు..
అంతేకాకుండా నా మూవీ పోస్టర్స్ ఓ థియేటర్ వద్ద తొలగించారని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. మా మూవీ పోస్టర్ ప్లేస్‌లో యశ్ టాక్సిక్ ఉందన్నారు. మన తెలుగు సినిమాలకు మనవాళ్లు సపోర్ట్ చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. కనీసం టాక్సిక్ పోస్టర్ పక్కనైనా నా పోస్టర్ పెట్టొచ్చు కదా... తీసి పడేయడం ఎందుకన్నారు.
పేరుమోసిన ఓ కాలేజీలో మూవీ ప్రమోషన్స్ కోసం ముందుగా పర్మిషన్ ఇస్తానని చెప్పారు. కానీ ఆ తర్వాత మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
అదే పెద్దాయన పెద్ద సినిమా కోసం స్టేజ్ మీద నిలబడి “నేను పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడ్డాను” అని చెబుతుంటే చాలా బాధ అనిపించింది.
ఆ సినిమా కోసం… pic.twitter.com/KQqboSQAVf— Tupaki (@tupaki_official) August 25, 2026


