సినిమాకు భాషతో సంబంధం లేదు. బాగుండాలే గానీ ఏ భాషా చిత్రమైనా సరే చూసే ప్రేక్షకులు బోలెడుమంది. ఇప్పుడు అలా తెలుగు ఆడియెన్స్ మధ్య చర్చకు కారణమైంది 'బత్తా'. విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర చేసిన ఈ తమిళ సినిమా.. గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరి నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ ఏడాది రిలీజైన అత్యుత్తమ చిత్రమని తెగ పొగిడేస్తున్నారు. మరి అంతలా ఇందులో ఏముంది? అసలు కథేంటి?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అపూర్వకి ఇచ్చిపడేశారు.. నామినేషన్లలో రచ్చ)
విజయ్ సేతుపతి.. ఓ లవ్‌లీ క్యూట్ గ్యాంగ్‌స్టర్‌గా చేసిన సినిమా 'బత్తా'. సేతుపతి పాత్ర పేరునే టైటిల్‌గా పెట్టారు. గ్యాంగ్‌స్టర్ అన్నాం కదా అని కత్తులు, నరుక్కోవడాలు ఉంటాయని అనుకోవద్దు. పూర్తిగా కామెడీ, ఎమోషనల్‌గా దీనిని తీశారు. బత్తా అనే గ్యాంగ్‌స్టర్‌ని ఓ పిల్లాడు.. స్కూల్‌లోని ఓ బాత్రూంలో పెట్టి బంధిస్తే తర్వాత ఏమైంది? బత్తాలో ఎలాంటి మార్పొచ్చింది? అనేది మిగతా స్టోరీ.
విజయ్ సేతుపతి ఇప్పటికే పలు సినిమాల్లో అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌లు ఇచ్చాడు. కానీ 'బత్తా'లో ఎప్పటికీ గుర్తుండిపోయే యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. సేతుపతే అనుకుంటే శబరి పాత్ర చేసిన పిల్లాడైతే ఆశ్చర్యపోయేంత షాకింగ్ నటించాడు. వీళ్లిద్దరే కాదు సేతుపతి భార్యగా చేసిన లిజోమోల్, కూతురిగా చేసిన పాప కూడా అదరగొట్టేశారు.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. తమకు పూర్తిగా సంతృప్తి చెందామని చెబుతున్నారు. అదే టైంలో ఈ ఏడాది తాము చూసిన అత్యుత్తమ చిత్రం ఇదేనని కూడా అంటున్నారు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకు చాలా అంటే చాలా ప్లస్ అయిందని చెబుతున్నారు. దర్శకుడు బాలాజీ ధరణిధరన్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువేని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ లాంటి చోట్ల 'బత్తా' సినిమా ప్రదర్శితమవుతున్నప్పటికీ ప్రస్తుతం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ చేస్తే అస్సలు మిస్ కావొద్దు!
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన)
sss


