బిగ్‌బాస్ తెలుగు 10లో ఐదోవారం వచ్చేసింది. దీంతో ఎప్పటిలానే నామినేషన్ల హడావుడి మొదలైపోయింది. ఓ గుమ్మడికాయని దాచిపెట్టి ఇద్దరిద్దర్ని పిలవగా.. ఇది దొరికినవాళ్లు ఇద్దరు, ఓడిపోయినవాళ్లు ఒకరిని నామినేట్ చేసే అవకాశం దక్కింది. గతవారం ఇమ్యూనిటీ లభించడంతో సుధీర్, వంశీ.. కెప్టెన్ కావడంతో వర్షిణిని నామినేట్ చేసేందుకు వీలులేదు. ఇంతకీ సోమవారం(అక్టోబర్ 05) ఎపిసోడ్‌లో అసలేం జరిగింది? ఎవరెవరు నామినేట్ అయ్యారు?
(ఇదీ చదవండి: సోషల్ మీడియాకు భయపడి 'ఆదర్శ కుటుంబం' వాయిదా)
కెప్టెన్ వర్షిణి మొదటగా వెళ్లి గుమ్మడికాయని దాచిపెట్టగా.. రాంప్రసాద్, ముకేశ్ వెతికారు. రాంప్రసాద్‌కి అది దొరికింది. దీంతో అమన్‌ని నామినేట్ చేశాడు. నువ్వు నా హీరోవి, అయినప్పటికి రోహిత్‌ని అలా అనడం నచ్చలేదు.. గేమ్‌లో కోపం చూపించుకో, కానీ బయటకాదని చెబుతూ త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. దీంతో త్రిగుణ్ మాట్లాడుతూ.. తాను డిఫెండ్ చేసుకోనని రోహిత్‌కు సారీ చెప్పాడు. రోహిత్ మాత్రం తాను క్షమించనని చెప్పాడు. ఈ క్రమంలో త్రిగుణ్, రోహిత్‌ల మధ్య గొడవ జరిగింది.
తర్వాత అవకాశం దక్కడంతో ముకేశ్.. అపూర్వని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ చేసిన టైంలో ప్రవర్తన నచ్చలేదని కారణం చెప్పాడు. ఈ క్రమంలో అపూర్వ, ముకేశ్ మధ్య మాటల యుద్ధం నడించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, చిన్నదో వైపు పెద్దదో వైపు లాంటి మాటలు మాట్లాడడం పద్దతి కాదని అపూర్వ చెప్పుకొచ్చింది. తర్వాత వంశీ గుమ్మడికాయ దాచిపెట్టగా.. అమన్, త్రిగుణ్ వెతికారు. చివరకు త్రిగుణ్‌కే దొరికింది. నన్ను రెచ్చగొట్టింది. బిగ్‌బాస్ రూల్స్ బ్రేక్ చేశారు? ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం నచ్చలేదని చెబుతూ అపూర్వని నామినేట్ చేశాడు. తర్వాత అమన్‌ని నామినేట్ చేశాడు. అనంతరం అమన్.. ఒకరిని మోటివేట్ చేయడానికి మరొకరిని కించపరిచాడు. బచ్చాగాడు అన్నాడని చెబుతూ ముకేశ్‌ని అమన్ నామినేట్ చేశాడు.
నరేశ్ గుమ్మడికాయ దాచగా.. షాలిని, వర్షిణి వెతికారు. వర్షిణి గెలిచింది. వైల్డ్ కార్డ్‌లా వచ్చి పోస్ట్‌కార్డులా పనిచేస్తున్నావని కారణం చెప్పి అపూర్వని నామినేట్ చేసింది. తర్వాత రోహిత్‌ని నామినేట్ చేసింది. షాలిని.. త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. మాటలు జారుతూ ఉంటారు. డామినేషన్ చేస్తారు? అని తన కారణాలు చెప్పింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మొత్తంగా చూస్తే ఈ వారం ఇప్పటివరకు సగం నామినేషన్స్ జరిగాయి. మిగతా ప్రక్రియ మంగళవారం ఉండనుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన)


