ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన | Epic Movie OTT Release Date Latest Update | Sakshi
Sakshi News home page

Epic OTT: ఆనంద్-వైష్ణవి రొమాంటిక్ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?

Oct 6 2026 9:53 AM | Updated on Oct 6 2026 10:32 AM

Epic Movie OTT Release Date Latest Update

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే ఏకంగా 23కి పైగా చిత్రాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో తెలుగువి కూడా చాలానే ఉన్నాయి. ఇవలా ఉండగానే తెలుగు రొమాంటిక్ మూవీ డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: సోషల్ మీడియాకు భయపడి 'ఆదర్శ కుటుంబం' వాయిదా)

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా చేసిన సినిమా 'ఎపిక్'. ఆదిత్య హాసన్ దర్శకుడు. విడుదలకు ముందు కాస్త హడావుడి చేశారు. కానీ గత నెలలో థియేటర్లలో రిలీజైన తర్వాత ఘోరమైన విమర్శలు ఎదుర్కొంది. రొమాన్స్ తప్పితే లాజిక్స్ అస్సలు చూపించలేదని ట్రోల్ చేశారు. ఇకపోతే ఈ మూవీ ఈ శుక్రవారం(అక్టోబర్ 09) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

'ఎపిక్' విషయానికొస్తే.. ‘#90స్’ సిరీస్‌లో పిల్లాడైన ఆదిత్య (ఆనంద్ దేవ‌ర‌కొండ‌).. పెరిగి పెద్దయిన తర్వాత సినిమా ద‌ర్శ‌కుడు కావాల‌ని క‌ల‌ కంటాడు. ఆ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గానే పైచ‌దువుల కోస‌మ‌ని లండ‌న్ వెళ్తాడు. తాను చేరిన యూనివర్సిటీలోని తెలుగ‌మ్మాయైన క‌డ‌లి (వైష్ణ‌వి చైత‌న్య)తో పరిచయమవుతుంది. తొలిరోజే ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌వుతారు. త‌ర్వాత స‌హ‌జీవ‌నం చేస్తారు. వేర్వేరు నేప‌థ్యాలకు చెందిన వీళ్లిద్ద‌రి మ‌ధ్య బంధం ఎక్క‌డివ‌ర‌కూ వెళ్లింది? ఆదిత్య.. ప్రేమ, పెళ్లి విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement