'సలార్', వారణాసి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమైన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.. ఎప్పటికప్పుడు వరస చిత్రాలతో థియేటర్లలోకి వస్తూనే ఉంటాడు. అలా గత నెలలో ఓ యాక్షన్ థ్రిల్లర్‍తో వచ్చాడు. ఇప్పుడిది ఓటీటీల్లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఏకంగా ఆరింటిలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వైశాఖ్ దర్శకత్వం వహించిన సినిమా 'ఖలీపా'. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. కాకపోతే థియేటర్లలో జనాల్ని ఓ మాదిరిగానే ఆకట్టుకుంది. ఇందులోనే మోహన్ లాల్, టొవినో థామస్ అతిథి పాత్రలు చేశారు. మాళవిక శర్మ హీరోయిన్. ఇకపోతే ఈ శుక్రవారం(అక్టోబర్ 09) నుంచి అమెజాన్ ప్రైమ్, స్టార్జ్ ప్లే, మనోరమ మ్యాక్స్, ఆహా తెలుగు, సింప్లీ సౌత్, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.
'ఖలీఫా' విషయానికొస్తే.. అమీర్ అలీ (పృథ్వీరాజ్) ఒక సాధారణ టెక్స్‌టైల్స్ వ్యాపారి. తండ్రి అకస్మాత్తుగా అరెస్ట్ కావడం, కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఇతడి జీవితం మారిపోతుంది. అప్పుడు తన కుటుంబం బంగారం స్మగ్లింగ్ సామ్రాజ్యానికి చెందినదనే నిజం తెలుసుకుంటాడు. కుటుంబ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి, పవర్‌లోకి రావడానికి అమీర్ అలీ.. అండర్‌వరల్డ్, గోల్డ్ స్మగ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు మిస్ కావొద్దు)


