మెగాస్టార్ టాక్‌ షోలో స్టార్ హీరో దంపతులు.. ఎవరో తెలుసా? | Star Couple attends at Chiranjeevi Megaverse Talk Show Goes Viral | Sakshi
Sakshi News home page

Megaverse Talk Show: మెగాస్టార్ టాక్‌ షోలో స్టార్ హీరో దంపతులు..!

Nov 17 2026 1:56 PM | Updated on Nov 17 2026 2:11 PM

Star Couple attends at Chiranjeevi Megaverse Talk Show Goes Viral

మెగాస్టార్ చిరంజీవి మెగా షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఆయన హోస్ట్‌గా సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ  షోకు మెగావర్స్ అనే పేరు కూడా ఖరారు చేశారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో టాలీవుడ్‌ కమెడియన్స్ బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సత్య పాల్గొన్నట్లు తెలుస్తోంది.  ఈ మెగా టాక్ షో నెట్‌ఫ్లిక్స్ వేదికగా అభిమానులను ‍అలరించనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఎప్పటి ప్రారంభం అనేది మాత్రం రివీల్ చేయలేదు.

ఈ నేపథ్యంలోనే ఈ షో పాల్గొనే వారికి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. దాదాపు ఇప్పటికే పలు ఎపిసోడ్స్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మెగా టాక్ షోలో కోలీవుడ్ స్టార్ జంట సూర్య, జ్యోతిక పాల్గొన్నారని ఇన్‌సైడ్ టాక్. వీరిద్దరు మెగాస్టార్‌ టాక్‌ షోలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్‌ ప్రకటనైతే రాలేదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవలే సూర్య హీరోగా వచ్చిన సీన్‌ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మరోవైపు చిరంజీవి కాకా మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement