తెలుగు హీరోను సర్‌ప్రైజ్‌ చేసిన బాలీవుడ్‌ నిర్మాత | Producer Deepak Mukut Gifts Luxury Car To Actor Harshvardhan Rane | Sakshi
Sakshi News home page

Harshvardhan Rane: తెలుగు హీరోను సర్‌ప్రైజ్‌ చేసిన బాలీవుడ్‌ నిర్మాత

Nov 17 2026 12:33 PM | Updated on Nov 17 2026 12:49 PM

Producer Deepak Mukut Gifts Luxury Car To Actor Harshvardhan Rane

తెలుగులో ‘తకిట తకిట’, ‘అవును’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు హర్షవర్ధన్ రాణేకు అరుదైన కానుక అందింది. బాలీవుడ్ నిర్మాత దీపక్ ముకుట్ ఆయనకు ఏకంగా రూ.3.5 కోట్లు విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హర్షవర్ధన్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

రూ.3.5 కోట్ల విలువైన కారు
హర్షవర్ధన్ కు నిర్మాత దీపక్ సరికొత్త ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా’ కారును బహుమతిగా అందించారు. దీని విలువ రూ.3.5 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ‘సనమ్ తేరీ కసమ్’ సినిమా గతేడాది రీ-రిలీజ్ సమయంలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అప్పుడే హర్షవర్ధన్‌కు ఓ కానుక ఇస్తానని దీపక్ ముకుట్ మాటిచ్చారట. తాజాగా ఆ మాటను నిలబెట్టుకుంటూ ఖరీదైన కారును బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా కారు తాళాలు అందిస్తున్న ఫొటోను షేర్ చేశారు. 

‘సనమ్ తేరీ కసమ్ 2’
నిర్మాత పోస్టును రీషేర్ చేసిన హర్షవర్ధన్ రాణే ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఎన్నో హామీలను చూశానని, కానీ దీపక్ ముకుట్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని కొనియాడారు.  ఈసారి ‘సనమ్ తేరీ కసమ్ 2’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు.

(ఇదీ చదవండి: నటి రోజా బర్త్‌డేలో సినీ తారల సందడి..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement