breaking news
Harsa vardhan
-
తెలుగు హీరోను సర్ప్రైజ్ చేసిన బాలీవుడ్ నిర్మాత
తెలుగులో ‘తకిట తకిట’, ‘అవును’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు హర్షవర్ధన్ రాణేకు అరుదైన కానుక అందింది. బాలీవుడ్ నిర్మాత దీపక్ ముకుట్ ఆయనకు ఏకంగా రూ.3.5 కోట్లు విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హర్షవర్ధన్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.రూ.3.5 కోట్ల విలువైన కారుహర్షవర్ధన్ కు నిర్మాత దీపక్ సరికొత్త ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా’ కారును బహుమతిగా అందించారు. దీని విలువ రూ.3.5 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ‘సనమ్ తేరీ కసమ్’ సినిమా గతేడాది రీ-రిలీజ్ సమయంలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అప్పుడే హర్షవర్ధన్‌కు ఓ కానుక ఇస్తానని దీపక్ ముకుట్ మాటిచ్చారట. తాజాగా ఆ మాటను నిలబెట్టుకుంటూ ఖరీదైన కారును బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా కారు తాళాలు అందిస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘సనమ్ తేరీ కసమ్ 2’నిర్మాత పోస్టును రీషేర్ చేసిన హర్షవర్ధన్ రాణే ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఎన్నో హామీలను చూశానని, కానీ దీపక్ ముకుట్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని కొనియాడారు. ఈసారి ‘సనమ్ తేరీ కసమ్ 2’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు.(ఇదీ చదవండి: నటి రోజా బర్త్‌డేలో సినీ తారల సందడి..) View this post on Instagram A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) -
తక్షణమే తప్పించండి
ముంబై: రైతుల ఆత్మహత్యలను నియంత్రించడంలో సహకార శాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ విఫలమయ్యారని శివసేన ఆరోపించింది. అందువల్ల ఆయనను తక్షణమే ఆ పదవినుంచి తప్పించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను కోరింది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు దివాకర్ రావుతే మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. వడ్డీవ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లును వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామంటూ హర్షవర్ధన్ పాటిల్ గత ఏడాది హామీ ఇచ్చారని, అయితే ఆ హామీ ఇప్పటిదాకా నెరవేరలేదన్నారు. వడ్డీవ్యాపారులను నియంత్రించడంకోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనావళిని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చిందని, ఇలా జరగడమే అనేకమంది రైతుల ఆత్మహత్యలకు దారితీసిందన్నారు. రైతుల ఆత్మహత్యలను నిలువరించడంలో హర్షవర్ధన్ ఘోరంగా విఫలమయ్యారని, అందువల్ల తక్షణమే ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధాన లోపాల కారణంగా గడచిన 13 సంవత్సరాల కాలంలో దాదాపు పదివేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఓ లేఖ రాసినట్టు ఆయన మీడియాకు తెలియజేశారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యేందుకు మరో మూడు నెలల వ్యవధి ఉందని, అందువల్ల పక్షం రోజుల్లోగా వడ్డీవ్యాపారుల ఆట కట్టించేందుకు ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ఆయ న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మహారాష్ర్ట మనీలెండింగ్ నియంత్రణ చట్టాన్ని వరుసగా ఏడో పర్యాయం కేంద్ర ప్రభుత్వం తిప్పిపంపిందనే వార్తల నేపథ్యంలో సేన నాయకుడు దివాకర్ రావుతే మీడియా తో పై విధంగా స్పందించారు.


