కాస్త ఒత్తిడిగా అనిపించింది... నో చెప్పలేకపోయాను : మమ్ముట్టి | Mammootty Comment On Om Movie At Pre Release Event | Sakshi
Sakshi News home page

కాస్త ఒత్తిడిగా అనిపించింది... నో చెప్పలేకపోయాను : మమ్ముట్టి

Nov 17 2026 12:43 PM | Updated on Nov 17 2026 12:54 PM

Mammootty Comment On Om Movie At Pre Release Event

‘‘మలయాళ సినిమాల తెలుగు అనువాదాలకు ఇక్కడి ప్రేక్షకాదరణ బాగా లభిస్తుంటుంది. ‘ఓం’ నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమాలో నాకు చాన్స్‌ వచ్చినప్పుడు నేను ఒప్పుకోలేని పరిస్థితి. అప్పుడు నాకు బాగాలేదు. మరి... నా కోసం ఎదురు చూస్తారా? అని దర్శకుడిని అడిగితే సరే అన్నాడు. ఇది నాకు కాస్త ఒత్తిడిగా అనిపించింది... నో చెప్పలేకపోయాను. మంచి సినిమాలకు మంచి ఫలితాలు వస్తాయి. ‘ఓం’ని థియేటర్స్‌లో చూడండి’’ అని మలయాళ స్టార్‌ మమ్ముట్టి అన్నారు. 

ఇదీ చదవండి: తెలుగు హీరోను సర్‌ప్రైజ్‌ చేసిన బాలీవుడ్‌ నిర్మాత

ధనుష్‌ హీరోగా రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఓం చాప్టర్‌ 1– ఉదిరం: ది బ్లడ్‌ ఉడ్‌’. మమ్ముట్టి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌గా నటించారు. శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్‌ జగ్మగ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్‌ కానుంది. 

OM Telugu Pre Release Event At Hyderabad HD Photos26

ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ అధినేత నాగవంశీ రిలీజ్‌ చేయనున్నారు.  సోమవారం జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ధనుష్‌ మాట్లాడుతూ– ‘‘ఓం’ ఆల్మోస్ట్‌ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలోని 30 శాతం డైలాగ్స్‌ తెలుగులో ఉంటాయి. తిరుమల, తిరువణ్ణామలై... ఈ రెండు టెంపుల్‌ సిటీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది. ఈ స్క్రిప్ట్‌ రాసిన రాజ్‌కుమార్‌కు యాభై శాతం క్రెడిట్‌ లభిస్తే, మిగతా సగం దర్శకుడు విజన్‌ను సపోర్ట్‌ చేసిన నిర్మాత శ్రద్ధాకు లభిస్తుంది. ఇందులోని సియా పాత్రకు మమ్ముట్టీగారే కావాలని రాజ్‌కుమార్‌ అన్నారు. ఆయన అద్భుతంగా నటించారు. ఈ రోజుల్లో సినిమా చేసి, సక్సెస్‌ చేయడం కష్టమవుతోంది. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులను ‘ఓం’ అలరిస్తుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. 

OM Telugu Pre Release Event At Hyderabad HD Photos25

‘‘ఈ సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి తెలుగులో నేను రిలీజ్‌ చేయాలనుకున్నాను. మమ్ముట్టీగారూ... మీ అబ్బాయి దుల్కర్‌గారి ‘లక్కీ భాస్కర్‌’ సినిమాను నేను ప్రొడ్యూస్‌ చేశాను. త్వరలో మీతో కలిసి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ‘ఓం’ సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుందని అనుకుంటున్నాను’’ అని అన్నారు నాగవంశీ. 

‘‘ఈ చిత్రంలో ఐపీఎస్‌ ఆఫీసర్‌ నిత్యారెడ్డిగా నటించాను. రియల్‌ లైఫ్‌లో మా తాతగారు డీఎస్‌పీగా రిటైర్డ్‌ అయ్యారు. పోలీస్‌ పాత్రలకు ట్రిబ్యూట్‌గా రాజ్‌కుమార్‌గారు నిత్య పాత్రను రాశారు’’ అని సాయి పల్లవి చెప్పారు. 

‘‘తమిళంలో ఇది మా తొలి సినిమా. మంచి కథ చెప్పిన రాజ్‌కుమార్‌గారికి, ఈ సినిమాలో భాగమైన ఆర్టిస్టులకు థ్యాంక్స్‌’’ అని చెప్పారు శ్రద్ధా అగర్వాల్‌. 
‘ఓం’ గురించి రాజ్‌కుమార్‌గారు చెప్పి, ఇందులో పాటలు ఉండవన్నారు. ఈ సినిమాలో నేను కొత్తగా కనిపిస్తాను. ఇకపై కొత్త నిర్ణయాలతో నా సినిమా జర్నీని ఉండబోతోంది’’ అన్నారు శ్రీలీల. క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ విష్ణు రామస్వామి, రచయితలు కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కావ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement