ఎన్‌కౌంటర్‌లో అత్యాచార నిందితుడు మృతి | Accused In Teen Girl Rape And Murder Case Killed In Police Firing In West Bengal, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో అత్యాచార నిందితుడు మృతి

Oct 27 2026 9:56 AM | Updated on Oct 27 2026 10:16 AM

Accused Killed in Police Firing in West Bengal

గైఘటా: పశ్చిమ బెంగాల్‌లో అత్యాచారం, హత్య కేసు మరోసారి తీవ్ర కలకలం రేపింది. గైఘటా ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రహ్లాద్ దాస్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. అక్టోబర్ 26వ తేదీ అర్ధరాత్రి నేరం జరిగిన ప్రదేశంలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించి, తిరిగి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కేసు నమోదైన ఒక్కరోజులోనే నిందితుడు మరణించడం చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి 11.50 గంటల సమయంలో నిందితుడు దాస్‌ను నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం నేరం జరిగిన సమయంలో అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకునేందుకు అతడి ఇంటికి వెళ్లారు. తిరిగి పోలీస్‌ స్టేషన్‌కు వస్తుండగా మూత్ర విసర్జన చేయాలని దాస్‌ కోరడంతో వాహనాన్ని నిలిపి, కిందకు దిగేందుకు అనుమతించారు. ఆ సమయంలో అతడు ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్వీస్‌ రివాల్వర్‌ను లాక్కొని, తప్పించుకునేందుకు అధికారిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు కాల్పులు జరపడంతో అక్కడున్న ఇతర పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా దాస్‌కు బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఈ ఘటనలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా గాయపడగా, పోలీసు వాహనం దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన దాస్‌ను వెంటనే చాంద్‌పారా బ్లాక్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యాధికారి తెలిపారు. గాయపడిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం 2026 మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల కాల్పుల్లో అత్యాచారం, హత్య కేసు నిందితుడు మరణించడం ఇది రెండో ఘటన. అంతకుముందు జూలై 5న చెరువులో 12 ఏళ్ల బాలిక మృతదేహం లభించిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రాభాస్‌ మండల్‌ కూడా పోలీసుల కాల్పుల్లో మరణించాడు. నేరం జరిగిన ప్రదేశంలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో పోలీసు ఆయుధాన్ని లాక్కొని కాల్పులు జరిపినట్లు అప్పట్లోనూ పోలీసులు వెల్లడించారు. తాజా ఘటనతో రాష్ట్రంలో ఇటువంటి ఎన్‌కౌంటర్లపై మరోసారి చర్చ మొదలైంది.

ఇదీ చదవండి: 53 రైళ్లు రద్దు.. ఒడిశా నుంచి యూపీ వరకు ‘అర్నబ్’ అలర్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement