53 రైళ్లు రద్దు.. ఒడిశా నుంచి యూపీ వరకు ‘అర్నబ్’ అలర్ట్! | IMD Cyclone Tracker, Andhra Pradesh And Odisha On Alert As Heavy Rains And Strong Winds Threaten Coastal Regions | Sakshi
Sakshi News home page

53 రైళ్లు రద్దు.. ఒడిశా నుంచి యూపీ వరకు ‘అర్నబ్’ అలర్ట్!

Oct 27 2026 9:12 AM | Updated on Oct 27 2026 10:46 AM

IMD Alert Andhra Pradesh odisha rains Cyclone tracker

న్యూఢ్లిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను క్రమంగా బలపడుతోంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందస్తు జాగ్రత్తగా 53 రైలు సర్వీసులను రద్దు చేయగా.. ఆంధప్రదేశ్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.

53 రైలు సర్వీసులు రద్దు: తుపాను ప్రభావం నేపథ్యంలో రైల్వే శాఖ అక్టోబర్ 27, 28 తేదీల్లో నడవాల్సిన 53 రైలు సర్వీసులను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రత కోసం 24 గంటలపాటు పనిచేసే వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసింది.

ఒడిశాలో భారీ వర్షాలు: తుపాను ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. ఆరు జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, డ్యామ్‌ల వద్దకు సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు.

15 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు: ఒడిశాలోని గజపతి జిల్లాలో తుపాను ముప్పు ఉన్న ప్రాంతాలకు చెందిన 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 281 తుపాను, తాత్కాలిక పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.

గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లు: ఒడిశాలోని గజపతి జిల్లాలో రానున్న 15 రోజుల్లో ప్రసవం అయ్యే అవకాశం ఉన్న 210 మంది గర్భిణులను ఆరోగ్య కేంద్రాలు, ప్రసూతి గృహాలకు తరలిస్తున్నారు. తుపాను సమయంలో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోనూ వర్ష సూచన: అక్టోబర్ 28 నుంచి 31 మధ్య ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్టోబర్ 29, 30 తేదీల్లో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

యానాం సమీపంలో తీరం దాటే అవకాశం: అర్నబ్ తుపాను అక్టోబర్ 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సంభవించవచ్చని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మరింత అప్రమత్తం: తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్లను విడుదల చేసింది. 15 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించింది. తీర ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేయడంతో పాటు బీచ్‌లలోకి ప్రజల ప్రవేశాన్ని నిషేధించింది. తాగునీటి సరఫరాకు 2,613 వాటర్ ట్యాంకర్లను సిద్ధంగా ఉంచింది.

రద్దయిన రైళ్ల వివరాలు..

అర్నాబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో వివిధ మార్గాల్లో నడవాల్సిన మొత్తం 53 రైలు సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విజయవాడ, రాజమండ్రి, కాకినాడ పోర్టు, విశాఖపట్నం, పార్వతీపురం, నరసాపురం, మచిలీపట్నం, భీమవరం, గుంటూరు తదితర ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది.

అక్టోబర్ 27, 28 తేదీల్లో రద్దయిన రైళ్లు:

67261 – రాజమండ్రి నుంచి విజయవాడ
67263 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67264 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67265 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67271 – మచిలీపట్నం నుంచి గుడివాడ
67272 – గుడివాడ నుంచి మచిలీపట్నం
67252 – మచిలీపట్నం నుంచి గుడివాడ
67253 – గుడివాడ నుంచి మచిలీపట్నం
67254 – మచిలీపట్నం నుంచి గుడివాడ
67255 – గుడివాడ నుంచి మచిలీపట్నం
67256 – మచిలీపట్నం నుంచి విజయవాడ
17267 – కాకినాడ పోర్టు నుంచి విశాఖపట్నం
17268 – విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్టు
07267 – పార్వతీపురం నుంచి విశాఖపట్నం
07268 – విశాఖపట్నం నుంచి పార్వతీపురం

అక్టోబర్ 27న రద్దయిన రైళ్లు:

67258 – విజయవాడ నుంచి నరసాపురం
67246 – నరసాపురం నుంచి రాజమండ్రి
17269 – విజయవాడ నుంచి నరసాపురం
17264 – నరసాపురం నుంచి భీమవరం జంక్షన్
67257 – విజయవాడ నుంచి నరసాపురం
17257 – విజయవాడ నుంచి కాకినాడ పోర్టు
67202 – విజయవాడ నుంచి రాజమండ్రి
67267 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67247 – నరసాపురం నుంచి గుంటూరు జంక్షన్
67276 – నరసాపురం నుంచి విజయవాడ
67301 – రాజమండ్రి నుంచి కాకినాడ పోర్టు
67285 – రాజమండ్రి నుంచి విశాఖపట్నం
67286 – విశాఖపట్నం నుంచి రాజమండ్రి

అక్టోబర్ 28న రద్దయిన రైళ్లు:

67266 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67275 – విజయవాడ నుంచి భీమవరం జంక్షన్
67277 – భీమవరం జంక్షన్ నుంచి నిడదవోలు జంక్షన్
67278 – నిడదవోలు జంక్షన్ నుంచి భీమవరం జంక్షన్
67244 – నరసాపురం నుంచి నిడదవోలు జంక్షన్
67245 – నిడదవోలు జంక్షన్ నుంచి నరసాపురం
17270 – నరసాపురం నుంచి విజయవాడ
67268 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67249 – గుంటూరు జంక్షన్ నుంచి రేపల్లె
67250 – రేపల్లె నుంచి గుంటూరు జంక్షన్
67248 – గుంటూరు జంక్షన్ నుంచి విజయవాడ
67269 – విజయవాడ నుంచి మచిలీపట్నం
67270 – మచిలీపట్నం నుంచి విజయవాడ
67281 – విజయవాడ నుంచి భీమవరం జంక్షన్
67283 – భీమవరం జంక్షన్ నుంచి నిడదవోలు జంక్షన్
67284 – నిడదవోలు జంక్షన్ నుంచి భీమవరం జంక్షన్
67282 – భీమవరం జంక్షన్ నుంచి విజయవాడ
67262 – విజయవాడ నుంచి రాజమండ్రి
67302 – కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రి
17258 – కాకినాడ పోర్టు నుంచి విజయవాడ
67229 – విజయవాడ నుంచి గుంటూరు జంక్షన్
67223 – గుంటూరు జంక్షన్ నుంచి రేపల్లె
67224 – రేపల్లె నుంచి తెనాలి జంక్షన్
67222 – తెనాలి జంక్షన్ నుంచి విజయవాడ
67251 – భీమవరం జంక్షన్ నుంచి మచిలీపట్నం

ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించిన రైలు నంబర్, తేదీని పరిశీలించి, బయలుదేరే ముందు అధికారిక రైల్వే విచారణ కేంద్రాల ద్వారా తాజా సమాచారాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు. రైళ్ల రద్దు కారణంగా కలిగే అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement