ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను.. | Cyclone Arnab: Heavy Rains In AP From October 26 | Sakshi
Sakshi News home page

ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను..

Oct 24 2026 12:01 PM | Updated on Oct 24 2026 12:36 PM

Cyclone Arnab: Heavy Rains In AP From October 26

సాక్షి, విజయవాడ: తూర్పుమధ్య బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం  కేంద్రీకృతమైంది.. అదే ప్రాంతంలో ఇవాళ రాత్రిలోపు వాయుగుండంగా, రేపు తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది.

బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి చేరే అవకాశముందని  విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.దీని ప్రభావంతో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్‌ తెలిపారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రఖర్‌ జైన్‌.. సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దని.. వాటిని వ్యాప్తి చేయొద్దన్నారు. అత్యవసర సహాయం, తుపాను వివరాల కోసం ఎస్డీఎంఏ టోల్ ఫ్రీ నంబర్లలో (112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు.

ఇదీ చదవండి: అయ్యో పాపం.. ఏనుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement