సాక్షి, చిత్తూరు జిల్లా: విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. ఐరాల మండలం చుక్కావారి పల్లి సమీపంలోని పంట పొలాల్లో అడవి ఏనుగు మృతి చెందగా.. ఉదయం పొలానికి వెళ్లిన రైతులు గుర్తించారు. హై టెన్షన్ విద్యుత్ తీగలు ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు శరీరంపై మూడు చోట్ల విద్యుత్తు తీగలు తగిలిన గుర్తులు ఉన్నాయి.
గత కొంతకాలంగా ఐరాల మండలంలోని చుక్కావారి పల్లి, గూబలవారిపల్లి ,పాకాల మండలంలోని కాకర్ల వారి పల్లి సిలగొందిమూల అటవీప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగు మృతి చెందిన సమాచారాన్ని అటవీ అధికారులకు అందించారు.
ఇదీ చదవండి: దిండు కింద నాగుపాము.. రాత్రంతా దానిపైనే నిద్ర!


