వైఎస్సార్ జిల్లా: పులివెందుల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. హఫీజ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. నామినేషన్ల రోజు జరిగిన పోలీసుల కాల్పుల్లో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హఫీజ్. ధైర్యంగా ఉండాలనీ, పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం
కడప కార్పొరేషన్ నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ సందర్భంగా జరిగిన దాడులు గురించి వివరాలు తెలుసుకున్నారు. మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి గెలుపునకు కృషి చేయాలని సూచించారు.
ఎన్ని దాడులు చేసినా పోరాటంతో పోటీలో నిలిచారని వైఎస్ జగన్ అభినందించారు. భేటీలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి, మాజీ మేయర్లు సురేష్ బాబు, పాక సురేష్ పాల‍్గొన్నారు.
ఇదీ చదవండి: ఈ రెండున్నరేళ్లలో ప్రజలపై వేసిన బండ చాలదా?: పేర్ని నాని


