ఈ రెండున్నరేళ్లలో ప్రజలపై వేసిన బండ చాలదా?: పేర్ని నాని | Perni Nani Slams Chandrababu Over TDP Conduct In Local Body Elections, Watch Full Pressmeet Video For Details | Sakshi
Sakshi News home page

ఈ రెండున్నరేళ్లలో ప్రజలపై వేసిన బండ చాలదా?: పేర్ని నాని

Oct 27 2026 3:49 PM | Updated on Oct 27 2026 4:34 PM

perni nani on chandrababu naidu and ap local body elections

మచిలీపట్నం: స్థానిక ఎన్నికల వేళ టీడీపీ ప్రదర్శిస్తున్న తీరు పట్ల మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం పేర్ని నాని మచిలీపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మీకు మళ్లీ ఓటు వేసి ప్రజలు ఇబ్బందులు పడాలా? జెడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో ఎందుకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టలేదు. నీతి నిజాయితీకి పెద్ద పీట వేశామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు.

మీ ఎమ్మెల్యేలు ఎవరైనా నీతి నిజాయితీగా ఉన్నారా?. అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలను కంట్రోల్‌ చేయడం లేదు. ఎమ్మెల్యేలను అవినీతికి దూరంగా ఉంచలేకపోతున్నారు. అసలు చంద్రబాబుకి నీతి, నిజాయితీ ఉన్నాయా? అర్నబ్‌ తుపాన్‌తో పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థులను సెలక్ట్‌ చేయలేకపోయారట. జనసేన కార్యకర్తలు త్యాగాలు చేయాలని పవన్‌ చెబుతున్నారు. ఈ రెండున్నరేళ్లలో ప్రజలపై వేసిన బండ చాలదా?’’ అని పేర్ని నాని అన్నారు.

ఎందుకు మీకు ఓట్లు వేయాలి?
ఓట్లు వేయండని చంద్రబాబు, పవన్, మాధవ్ అడుగుతున్నారని పేర్ని నాని చెప్పారు. ఏపీ ప్రజలు ఎందుకు వాళ్లకు ఓట్లు వేయాలని పేర్ని నాని నిలదీశారు. ‘‘కనీసం మీ అంతరాత్మను ప్రశ్నించుకోరా? మీకు ఎందుకు ప్రజలు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నా. ప్రజలను లూఠీ చేసినందుకు ఓట్లు వేయాలా? బియ్యం కట్ట 2600 రూపాయలకు చేరినందుకు మీకు ఓట్లు వేయాలా? నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నందుకు ఓట్లు వేయాలా? కేజీ ఉల్లిపాయలు 60 రూపాయలకు తెచ్చినందుకు ఓట్లు వేయాలా? మీరు ముగ్గురూ జనం సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నందుకు ఓట్లు వేయాలా? హెలీకాప్టర్లలో హైదరాబాద్ కు వారంవారం ట్రిప్పులు వేస్తున్నందుకు ఓట్లు వేయాలా? పాదయాత్రలో సెల్ఫీలు దిగుతూ లోకేష్ తో చాలా మాట్లాడించారు.

అప్పుడు పెట్రోల్ బంక్ ల ముందు సెల్ఫీలు దిగారు. ఇప్పుడు పెట్రోల్,డీజిల్ ఎంత ఉన్నాయో తెలియదా? రేట్లు తగ్గాలంటే చంద్రబాబుకు ఓటు వేయాలన్నారు. ఎందుకు రేట్లు తగ్గడం లేదు. కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెబుతున్నారు. చంద్రబాబు మాటలన్నీ ట్రూ డౌన్ మాటలే. చంద్రబాబు ఒక ఫేక్ సీఎం. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే. ఈ రాష్ట్రానికి మీరు ఏం పొడిచేశారో సమాధానం చెప్పాలి. మీది ఆలీ బాబా ఇద్దరు దొంగల కూటమి. ఈ రెండున్నరేళ్లలో ప్రజల నెత్తిన వేసిన బండ సరిపోవట్లేదా? 
ట్రిపుల్ ఇంజన్ సర్కారు రావాలంటున్నారు. ఈ రెండున్నరేళ్లలో ప్రజలను దంచి దంచి వదిలిపెట్టారు. మున్సిపాల్టీల్లోనే మంచి నాయకత్వం కావాలా? జిల్లా పరిషత్ ఎన్నికల్లో మంచి నాయకత్వం వద్దా? మండలాల్లో ప్రత్యక్ష ఎన్నికలు అవసరం లేదా?’’ అని చెప్పారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement