తాడేపల్లి: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మరో కుట్రకు తెరలేపింది పచ్చ మీడియా. స్థానిక ఎన్నికల్లో కూటమి అరాచకాలను డైవర్ట్ చేసేందుకు మరో అసత్య ప్రచారం చేస్తోంది. షర్మిలకు వైఎస్ భారతిరెడ్డి లేఖ రాశారంటూ అబద్ధపు ప్రచారాన్ని తెర మీదకు తెచ్చింది. రాయని లేఖను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది టీడీపీ అండ్ కో. ఆపై పచ్చ మీడియాలో వైఎస్ భారతిరెడ్డి లేఖ పేరుతో ఫేక్ ప్రచారం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కూటమి దుశ్చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్న వేళ డైవర్షన్ కోసం ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తోంది. లేఖను సృష్టించి వైఎస్ భారతిరెడ్డి లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియాలో బ్రేకింగులు వేసి నమ్మించే కుట్ర చేస్తున్నారు. ఇంత నీచానికి దిగజారుతారా? అంటూ కూటమిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

ఇదీ చదవండి: కాల్పుల్లో గాయపడ‍్డ హఫీజ్‌కు ఫోన్ చేసి మాట్లాడిన వైఎస్ జగన్


