Mandala Parishad Polls
-
అధికారపార్టీ అడ్డదారులు
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు కుట్రలకు పదును పెట్టారు. సంఖ్యాబలం లేకపోయినా పదవుల్ని తమ ఖాతాలో వేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాట వినకపోతే కిడ్నాప్‌లకూ వెనుకాడటం లేదు. ‘మీరు ఎన్నిచోట్ల గెలిస్తే మాకేంటి. మాకు ఒక్క సభ్యుడు లేకపోయినా.. మీకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బలం ఎంత ఉన్నా మమ్మల్నేం చేయలేరు. ఈ ప్రభుత్వం మాది. మేం చెప్పిందే వేదం. మేం చేసేదే శాసనం. మా మాట వినకుంటే మీరెవరూ బతికి బట్టకట్టలేరు’ అంటూ రెచ్చిపోతున్నారు. – సాక్షి, అమరావతిఅచ్చంపేటలో కిడ్నాప్పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ పదవికి గురువారం ఎన్నిక జరనుండగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థిని, ఆమె భర్తను బుధవారం మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు. నాలుగు కార్లలో వచ్చి టీడీపీ మూకలు వారిద్దరినీ ఎత్తుకెళ్లి అజ్ఞాతంలోకి తరలించారు. 2021 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికలలో అచ్చంపేట మండల పరిషత్ పరిధిలోని మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు గాను.. 16 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఆ పార్టీ తరఫున తాడువాయి, మాదిపాడు ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీ అభ్యర్థులు భూక్యా రజనీబాయి, భూక్యా స్వర్ణమ్మభాయి గెలుపొందారు. రిజర్వేషన్ ప్రకారం.. భూక్యా రజనీబాయిని ఎంపీపీగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యక్తిగత కారణాల వల్ల రజనీబాయి ఆ పదవికి రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నూతన ఎంపీపీని ఈ నెల 27వ తేదీన ఎన్నుకోవాల్సి ఉంది.అయితే, టీడీపీకి ఎస్టీ అభ్యర్థే లేరు. దీంతో ఎంపీపీ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర పన్నారు. బుధవారం అర్ధరాత్రి పోలీసుల సాయంతో ఎంపీటీసీల ఇళ్లపై పడ్డారు. 15మంది ఎంపీటీసీల్లో 8 మందిని గంజాయి, అక్రమ మద్యం కేసుల్లో ఇరికించి నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించి రహస్య స్థావరానికి తరలించారు. మరోవైపు మాదిపాడు ఎంపీటీసీ భూక్యా స్వర్ణమ్మబాయిని టీడీపీ కండువా కప్పుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. వినకపోవడంతో బుధవారం ఉదయం 12గంటల సమయంలో టీడీపీ నాయకులు నాలుగు కార్లలో వచ్చి స్వర్ణమ్మబాయిని, ఆమె భర్త రమేష్ నాయక్‌ను కిడ్నాప్ చేసి అజ్ఞాతంలోకి తరలించారు. టీడీపీ దాడులతో రచ్చరచ్చశ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి తమ అభ్యర్థికి సంబంధించి బీఫామ్ అందజేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై బుధవారం టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. పార్టీ లీగల్ సెల్ నాయకులు బీఫామ్ అందజేసేందుకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన వాహనంలో రామగిరి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోగా టీడీపీ నాయకులు దాడి చేశారు.వైఎస్సార్సీపీ నేతలను నిర్బంధించారు. మరోవైపు రొద్దం, కదిరి నియోజకవర్గం గాండ్లపెంటలో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఆ రెండుచోట్లా ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తగిన బలం లేకపోయినా ఎమ్మెల్యే పరిటాల సునీత అధికార బలాన్ని ఉపయోగించి ఎంపీపీ పదవిని అడ్డదారిలో టీడీపీ ఖాతాలో వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.వైఎస్సార్ జెడ్పీలో ఎన్నిక అడ్డుకునేందుకు..వైఎస్సార్ జిల్లా పరిషత్ పరిధిలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 2021 ఎన్నికల్లో 49 స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ప్రస్తుతం అక్కడ జెడ్పీ చైర్మన్‌కు ఎన్నిక జరుగుతోంది. కొందరు జెడ్పీటీసీలు పార్టీ ఫిరాయించగా.. ఇప్పటికీ 42 మంది జెడ్పీటీసీలు వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారు. చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ తర్వాత టీడీపీకి సభ్యుల బలం లేని కారణంగా పోటీ చేయడం లేదని ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రకటించారు. అయితే, టీడీపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క జెడ్పీటీసీతో జెడ్పీ చైర్మన్ ఎన్నికను నిలుపుదలకు హైకోర్టును ఆశ్రయించారు.ఒక్క సభ్యుడు లేకపోయినా..నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ పెద్దఎత్తున ప్రలోభాలు మొదలుపెట్టింది. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీలకు గాను వైఎస్సార్సీపీ 12 మంది, సీపీఎంకు ఇద్దరు సభ్యుల చొప్పున బలం ఉంది. టీడీపీకి ఒక్క సభ్యుడు కూడా లేకపోయినా ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు అరాచకాలకు తెరతీసింది. 8 మంది ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ నేతలు చివరి నిమిషం వరకూ ప్రలోభాలకు గురి చేస్తూనే ఉన్నారు. » పల్నాడు జిల్లా అచ్చంపేటలో టీడీపీకి ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎంపీటీసీ, ఆమె భర్త కిడ్నాప్ » సత్యసాయి జిల్లా రామగిరిలో బీఫామ్ ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మూకల దాడి » తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ఎంపీటీసీలకు రూ.3 లక్షల చొప్పున ఎర » ముగ్గురు ఎంపీటీసీలున్న కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి కోసం జనసేన బరితెగింపు » తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో అక్రమాల నివారణకు న్యాయస్థానం తలుపుతట్టిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి » ఒకే సభ్యుడు ఉండటంతో వైఎస్సార్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ ‘తూర్పు’లో ప్రలోభాలుతూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ఎంపీపీ స్థానంలో గెలిచేందుకు తగిన బలం లేని కూటమి పార్టీల నేతలు వైఎఎస్సార్సీపీ ఎంపీటీసీల్లో కొందరికి రూ.3 లక్షల చొప్పున ఆశచూపారు. నలుగురు వైఎస్సార్సీపీ సభ్యులను ఎన్నిక వేళ హాజరుకాకుండా ఉండాలని అధికార పార్టీ శ్రేణలు బెదింపులకు దిగుతున్నారు. కాకినాడ రూరల్ మండల పరిషత్‌లో జనసేన పార్టీ వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేస్తోంది. మండలంలో 18 మంది ఎంపీటీసీలు ఉండగా.. వైఎస్సార్సీపీకి 15 మంది, జనసేనకు ముగ్గురు చొప్పున ఉన్నారు. ఎంపీపీ ఎన్నిక దృష్ట్యా ఏడుగురు ఎంపీటీసీకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చేలా ప్రలోభపెట్టి ఆ పార్టీలో చేర్చుకున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నేడు రెండు జెడ్పీ, 60 మండలపరిషత్లలోఎన్నికలుఖాళీగా ఉన్న వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి గురువారం ఎన్నిక జరగనుంది. కర్నూలు జెడ్పీ కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 60 మండలాల్లో 28 ఎంపీపీ పదవులు, 23 మండల ఉపాధ్యక్ష, 12 మండల కో–ఆప్టెడ్ సభ్యుల పదవులకు సైతం గురువారం ఎన్నికలు జరగనున్నాయి.ఇందుకు సంబంధించి ఈ నెల 18న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు 200 గ్రామ పంచాయతీల్లోనూ ఉప సర్పంచ్ స్థానాలకు గురువారమే ఎన్నికలు జరగనున్నాయి. – సాక్షి, అమరావతిఫిర్యాదు చేస్తే చించేశారుచిత్తూరు జిల్లాలో రామకుప్పం మండల పరిషత్ అధ్యక్షురాలు శాంతకుమారి మరణంతో ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ 16 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అన్నిచోట్లా వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలకు తెరలేపింది. ఉప ఎన్నిక సజావుగా నిర్వహించాలని, వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త భరత్‌కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు కాపీని టీడీపీ నేతలు పోలీసుల నుంచి లాక్కుని చించివేశారు.శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 6 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీ జగన్మోహన్ ఆ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యౖమెంది. బలం లేకపోయినా ఎంపీపీ కుర్చీని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై ఒత్తిడి తెస్తున్నారు.ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎంపీపీ పోటీలో ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యునిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించారు. మరో ఎంపీటీసీ సభ్యునిపైనా కేసు నమోదు చేయించారు. పుల్లలచెరువు మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి సైతం ఎన్నిక జరుగుతుండగా.. ఇక్కడ మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలుకు గాను 11 స్థానాలు వైఎస్సార్సీపీ, 4 స్థానాలు టీడీపీ పక్షాన ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు టీడీపీ ప్రలోభాలు పెట్టేందుకు చివరి నిమిషం వరకు తీవ్రంగా యత్నిస్తోంది.తిరుపతిలో వైఎస్సార్సీపీ ముందుజాగ్రత్తతిరుపతి ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి రాజీనామా చేయటంతో గురువారం ఉప ఎన్నిక జరుగుతోంది. మండలంలో 40 ఎంపీటీసీ స్థానాలుండగా.. 38చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఒకస్థానం టీడీపీ టీడీపీ దక్కించుకుంది. ప్రస్తుతం 32 మంది ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ వెంటే ఉండగా.. ప్రలోభాల లొంగిన ఐదుగురు ఎంపీటీసీలు టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా కూటమి నేతల అరాచకాలను దృష్టిలో ఉంచుకుని ఎంపీపీ ఎన్నికను సజావుగా నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
అవి ఓకే.. మరి ఇవి?
సాక్షి, వరంగల్: జిల్లా ప్రజా పరిషత్‌ల తుదిరూపుపై స్పష్టమైన మార్గదర్శకాలు అందకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఈనెల 7, 8వ తేదీల్లో ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికతో ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల అధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ కా ర్యాలయాల ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల కేటాయింపు, మౌలిక వసతులపై మార్గదర్శకాలు అందకపోవడంతో అధికారులు సందిగ్దావస్థలో ఉన్నారు. గత ఐదునెలలుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, లెక్కింపు, పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియలో జెడ్పీ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇక కొత్త పాలకవర్గాలు వచ్చే నెల 5వ తేదీ కొలువు దీరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, జిల్లా పరిషత్‌ల కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ముందుకు సాగాలంటే ప్రభుత్వం నుంచి సూచనలు, సలహాలతో కూడిన మార్గదర్శకాలు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. ఉద్యోగుల విభజన, కేటాయింపే సమస్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2014 ఎన్నికల సమయంలో ఒకే జిల్లా పరిషత్, 50 మండల పరిషత్‌లు ఉండగా... జిల్లా పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లు, 71 మండల పరిషత్, జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లా పరిషత్‌లు, ఆ జెడ్పీల పరిధిలో 70 జెడ్పీటీసీ, 780 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆరు జిల్లా పరిషత్‌లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక 67 మండల పరిషత్‌లకు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు కూడా ఎన్నికయ్యారు. ఈ ప్రక్రియ మొత్తం సజావుగానే సాగినా జిల్లా పరిషత్ విభజనపై ఇప్పటికీ మార్గదర్శకాలు అందలేదు. కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు అవసరమైన కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనపై కసరత్తుతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తారా.. లేదా వర్క్ టు సర్వ్ కింద ఉన్న సిబ్బందినే ఆయా జిల్లాలకు కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. ఆరు జిల్లాలకు నోడల్ జెడ్పీగా ఉన్న వరంగల్ జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కేడర్ల వారీగా.. ఇప్పటి వరకు ఉన్న మౌలిక సదుపాయాలు, సామగ్రి వివరాలను రెండు నెలల క్రితమే ఉద్యోగులు కమిషనర్‌కు నివేదించారు. ప్రస్తుతం 74 మంది.. వరంగల్ జెడ్పీలో ప్రస్తుతం జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓతో పాటు 8 మంది సూపరింటెండెంట్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, 29 జూనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు టైపిస్టులు సహా రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, డ్రైవర్లు మొత్తం 74 మంది ఉన్నారు. కొత్తగా ఏర్పడే ఒక్కో జిల్లా పరిషత్‌కు కనీసం 19 మంది సిబ్బంది అవసరం. సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఇద్దరు సూపరింటెండెంట్లు, ముగ్గురు సీని యర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఆరుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఇలా మొత్తం ఒక్కో జెడ్పీలో ఎంత తక్కువ అనుకున్నా కనీసం 19 మంది అవసరం అవుతుందని అంచనా. ఈ లెక్కన ఆరు జిల్లాలకు కలిపి 114 మంది అవసరమవుతా రు. అదే విధంగా ఫర్నీచర్, కంప్యూటర్లు, ఫ్యాన్లు, జిరాక్సు యంత్రాలు తదితర సామగ్రి కూడా కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా పదోన్నతులు కల్పించి కొత్త జిల్లాలకు సిబ్బందిని బదిలీ చేస్తారా లేదా సర్వ్ టు రూల్ కింద ఆయా జిల్లాల కలెక్టర్లే సిబ్బందిని కేటాయిస్తారా అన్న అంశాలు జిల్లా పరిషత్ ఉద్యోగుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎంపీడీఓలు ఏరీ? ఉమ్మడి జిల్లాలో జిల్లాల పునర్విభజనతో పాటే కొత్త మండలాలు ఏర్పడగా వాటిలో ఎంపీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో ఖిలా వరంగల్, కాజీపేట, ఐనవోలు, వేలేరు, దామెర, టేకుమట్ల, కన్నాయిగూడెం, పలిమెల, గంగారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్ద వంగర, తరిగొప్పుల, చిల్పూరు తదితర మండలాలు ఏర్పడగా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మండలాల్లో కొత్త ఎంపీడీఓ కార్యాలయాల ఏర్పాటుతోపాటు ఉద్యోగులను విభజించి కేటాయించాల్సి ఉంది. ఒక్కో మండల పరిషత్‌కు కనీసం 9 మంది ఉద్యోగులను నియమిస్తే పాలన సాఫీగా కొనసాగుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఓ ఎంపీడీఓ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు అవసరమని పేర్కొన్నారు. కాగా, కొత్త కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపుల మార్గదర్శకాలు సైతం జెడ్పీకి ఇంకా రాలేదని అధికారిక సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ ఛైర్పర్సన్లతో పాలకవర్గాలు ఏర్పడగా.. వచ్చే జులై 5న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. ఈలోగా కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాలతో పాలన ప్రారంభిస్తారా లేదా.. అద్దె భవనాల్లోనా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను జెడ్పీకి కేటాయిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా... జిల్లా పరిషత్‌లు 06 మండల పరిషత్‌లు (4 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికాలేదు) 71 ప్రస్తుతం వరంగల్ జెడ్పీలో ఉద్యోగులు 74 ఒక్కో కొత్త జెడ్పీకి కావాల్సిన ఉద్యోగులు 19 ఒక్కో ఎంపీడీఓ కార్యాలయానికి కావాల్సిన ఉద్యోగులు 9 -
మళ్లీ..నాలుగు చోట్ల వాయిదా
మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో శుక్రవారం ఆరు మండలాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆయా మండలాల్లో రెండో రోజు శనివారం నాలుగుచోట్ల (భువనగిరి, యాదగిరిగుట్ట, మునగాల, ఆత్మకూర్.ఎస్) కోరం లేక వాయిదా పడ్డాయి. మునుగోడు ఎంపీపీగా టీఆర్ఎస్ బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా, చిట్యాల ఎంపీపీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది. భువనగిరి.. మళ్లీ వాయిదా భువనగిరి : భువనగిరి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక రెండవ రోజైన శనివారమూ వాయిదా పడింది. శుక్రవారం కోరం లేక ఎన్నికను వాయిదా వేసిన విషయం తెలిసిందే. మొత్తం 14మంది ఎంపీటీసీలు, ఒక కోఆప్షన్ సభ్యుడు, ఎక్స్అఫీషియో సభ్యుడైన స్థానిక శాసనసభ్యుడు ఎన్నికకు హాజరు కావాల్సి ఉంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 4 గంటల వరకు ఏ ఒక్క సభ్యుడూ హాజరుకాలేదు. దీంతో ఎన్నికల అధికారి దేవ్‌సింగ్ ఎన్నిక వాయిదా వే స్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఎన్నికల కమిషన్ నుంచి తేదీ వచ్చిన తర్వాత సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు. గుట్ట ఎంపీపీ ఎన్నిక నిరవధిక వాయిదా యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. 4వ తేదీన ఎన్నిక జరగకపోతే మరునాడే ఉంటుందని ప్రకటించిన అధికారులు గుట్టలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల మూలంగా శనివారం కూడా సమావేశం జరపకుండా నిరవధికంగా వాయిదా వేశారు. తదుపరి సమావేశం తేదిని నిర్ణయించేది రాష్ట్ర ఎన్నికల కమిషనేనని ఎన్నికల అధికారి డాక్టర్ అప్పారావు తెలిపారు. 4న టీఆర్ఎస్కు చెందిన 8మంది, ఒక స్వతంత్ర ఎంపీటీసీ సమావేశానికి హాజరుకాలేదు. కాంగ్రెస్ ఎంపీటీసీలు ఆరుగురు, మరో స్వతంత్ర అభ్యర్థి మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. కోరం ఉండి కోఆప్షన్ సభ్యుడిని ఎన్నుకుంటే ఎంపీపీ ఎన్నిక వాయిదాపడినా మరునాడే జరుపుతారు. కానీ కోఆప్షన్ సభ్యుడి ఎంపిక జరగకపోవడంతో సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎంపీపీ ఎన్నిక చిట్యాల : చిట్యాల మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక శనివారం తీవ్ర ఉద్రిక్తతల నడమ నిర్వహించారు. ఎంపీపీగా టీఆర్ఎస్కు చెందిన బట్టు అరుణ ఎన్నికయ్యారు. శుక్రవారం కోరం లేక వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు పోలీసు బందోబస్తుతో నల్లగొండ నుంచి చిట్యాలకు వాహనాలలో బయలుదేరారు. చిట్యాలలో ఉరుమడ్ల రోడ్డులోని ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలోకి రాగానే టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎంపీటీసీ సభ్యులు వస్తున్న బస్సుపై కొందరు రాళ్లతో దాడిచేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఆనంతరం ఆ ఎంపీటీసీ సభ్యులు నిర్ణీత ఎన్నిక సమయానికి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం 16 మంది ఎంపీటీసీ సభ్యులు కాగా, బస్సులోని ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు హాజరుకాగా, సీపీఎంకు చెందిన ఇద్దరు గైర్హాజరయ్యారు. అప్పటికే అదే గదిలో ఉన్న టీఆర్ఎస్, టీడీపీ సభ్యులు ఆరుగురు పక్క గదిలోకి వెళ్లారు. కాంగ్రెస్‌కు చెందిన మరో ఇద్దరు సభ్యులు రాకపోవడంతో కోరం లేక అధికారులు ఎన్నికను ప్రారంభించలేదు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు మరికొందరు కార్యాలయంలోకి రావడంతో పోలీసులు మరోసారి లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రాజేశ్వరావులతో ఎమ్మెల్యే వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సమావేశ గదికి చేరుకుని ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులను కోరారు. టీఆర్ఎస్, టీడీపీలకు చెందిన ఆరుగురు ఎంపీటీసీలకు తోడు కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు పాల్గొనడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. దీంతో టీఆర్ఎస్కు చెందిన వనిపాకల ఎంపీటీసీ సభ్యురాలు బట్టు అరుణను ఎంపీపీగా పెద్దకాపర్తి ఎంపీటీసీ సభ్యురాలు ఓర్సు లక్ష్మమ్మ ప్రతిపాదించగా ఉరుమడ్ల ఎంపీటీసీ సభ్యుడుఅబ్బయ్య బలపర్చారు. బరిలో ఎవరూలేకపోవడంతో ఆమె ఎంపీపీ ఎన్నికైనట్టు ప్రకటించారు వైస్ ఎంపీపీగా టీడీపీకి చెందిన మల్లేష్ ఎన్నికయ్యారు.