5న జెడ్పీటీసీ, ఎంపీటీసీల పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

5న జెడ్పీటీసీ, ఎంపీటీసీల పోలింగ్‌

Oct 29 2026 12:54 AM | Updated on Oct 29 2026 12:54 AM

నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీల పోలింగ్‌, ఓట్ల లెక్కింపు తేదీలను మారుస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బుధవారం జారీ చేసింది. వాస్తవానికి మొదట ఖరారు చేసిన మేరకు పోలింగ్‌ను నవంబర్‌ మూడున.. కౌంటింగ్‌ను ఐదున చేపట్టాల్సి ఉంది. అయితే మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ను మూడున నిర్వహించనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా ఉత్తర్వుల మేరకు ఐదున పోలింగ్‌.. ఏడున కౌంటింగ్‌ను చేపట్టనున్నారు. కాగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని మండలాలకు జెడ్పీ కార్యాలయం నుంచి బుధవారం తరలించారు.

30 జెడ్పీటీసీలకు

103 మంది పోటీ

● ఐదు జెడ్పీటీసీలు, 440 ఎంపీటీసీల్లో 78 ఏకగ్రీవం

● 362 ఎంపీటీసీలకు బరిలో

887 మంది అభ్యర్థులు

నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయితే.. 22 గంటల తర్వాత పోటీలో అభ్యర్థుల వివరాలు అధికారులు వెల్లడించారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. 35 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఐదింటిని టీడీపీ నేతలు అడ్డదారుల్లో ఏకగ్రీవం చేసుకున్నారు. 30 జెడ్పీటీసీ స్థానాల్లో 103 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 440 ఎంపీటీసీలకు 78 ఏకగ్రీవం కాగా, మిగిలిన 362 స్థానాల్లో 887 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ధ్రువీకరణ పత్రాలను

ఐదులోపు సమర్పించాలి

నెల్లూరు (టౌన్‌): ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రాధాన్య విభాగాల ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ ధ్రువీకరణ పత్రాలను నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నవంబర్‌ ఐదులోపు సమర్పించాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దివ్యాంగులైన ఉద్యోగులు, మానసిక దివ్యాంగ పిల్లలు కలిగిన వారు తదితరుల ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలను సంబంధిత ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పరిశీలించి రెండు సెట్ల గెజిటెడ్‌ అటెస్టెడ్‌ జిరాక్స్‌ కాపీలు, ఉద్యోగ వివరాలతో కూడిన దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

ఎన్నికల ఖర్చులు

పక్కాగా ఉండాలి

నెల్లూరు(పొగతోట): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజు వారీ ఖర్చులను పక్కాగా అందజేయాలని వ్యయ పరిశీలకుడు సాయిబాబు పేర్కొన్నారు. నగరంలోని జెడ్పీ కార్యాలయంలో అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ వివరాలను సూచించిన మేరకు అందజేయాలని కోరారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. జెడ్పీ సీఈఓ మధుసూదన్‌, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య, జిల్లా సహకార అధికారి గురప్ప, జిల్లా ఆడిట్‌ అధికారి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌

కేంద్రంలో పరిశీలన

నెల్లూరు రూరల్‌: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా సక్రమంగా వినియోగించుకోవాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఓటింగ్‌ ప్రక్రియపై వివరాలను ఆరాతీశారు.

శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 79,7 74 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు ద ర్శించుకున్నారు. తలనీలాలను 21,886 మంది అర్పించారు. హుండీలో రూ.4.84 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారి కి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement