ఓటమి భయం.. టీడీపీ ఎమ్మెల్యే ప్రలోభాలు | Kalyandurg TDP MLA Amilineni Surendra Babu Faces Allegations Of Inducements Ahead Of Local Body Elections | Sakshi
Sakshi News home page

ఓటమి భయం.. టీడీపీ ఎమ్మెల్యే ప్రలోభాలు

Oct 29 2026 11:02 AM | Updated on Oct 29 2026 12:00 PM

Kalyandurg Tdp Mla Amilineni Surendra Babu Temptations

సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రలోభాలకు తెరతీశారు. తాగు నీటి సమస్య ఉందని దొడగట్ట గ్రామస్తులు.. గత రెండున్నర సంవత్సరాలుగా చెబుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఓటమి భయంతో టీడీపీ నేతలు బోరు వేయిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కొండాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేతలపై ఎమ్మెల్యే సురేంద్రబాబు వర్గం దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత ఆంజనేయులు బైక్‌కు నిప్పు పెట్టారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నారు.

ఇదీ చదవండి: అమ్ముడుపోయిన అధికారం!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement