breaking news
Low pressure area
-
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అండమాన్ సముద్రం సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం ఉదయం అల్పపీడనంగా బలపడినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. రానున్న 72 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ అల్పపీడనం తుపానుగా మారుతుందా.. లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే వాతావరణ శాఖ ప్రస్తుతానికి ఎలాంటి తుపాను హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు.మరోవైపు ఇప్పటికే తీవ్ర తుపాను ‘అర్నబ్’ బలహీనపడుతోంది. గురువారం ఉదయం 8.30 గంటల సమయానికి దక్షిణ ఛత్తీస్‌గఢ్, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో ఇది వాయుగుండంగా కొనసాగింది. గత ఆరు గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలింది. గురువారం రాత్రికి మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.ఒకవేళ ఇది తుపానుగా మారితే ఆంధ్రప్రదేశ్ తీరానికి మరో ముప్పు పొంచి ఉన్నట్టే. ఇప్పటికే అర్నబ్ తుపాన్ ప్రభావంతో ఇవాళ కూడా(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తడిసి ముద్దయిన ఉత్తరాంధ్రపై మరోసారి కుండపోత కురిస్తే వాగులు, వంకలు ఉప్పొంగే ప్రమాదం ఉంది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి.గురువారం కూడా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో 10వ నంబర్, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 9వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు తుపానులుగా బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాంతో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కదలికలు, దాని తీవ్రతను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ఇదీ చదవండి: ఎన్నికల్లో ప్రముఖ జ్యోతిష్యుడి భార్య ఘోర ఓటమి! -
బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. సోమవారం మధ్యాహ్నానికి పారాదీప్–సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరందాటే అవకాశాలున్నట్లు తెలిపింది.ఉత్తరాంధ్రలో బలమైన గాలులు..తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55–65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు బుధ వారం వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అత్యవసర హెచ్చరిక జారీచేసింది. -
రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు రోజులుగా దంచికొడుతున్న వానలు గురువారానికి కాస్త నెమ్మదించాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 29.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని చోట్లా భారీ వర్షాలు పడ్డాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల వర్షాలు తెరిపినిచ్చాయి. శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. అయితే ఏ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయలేదు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. బలహీనపడ్డ అల్పపీడనం: ఒడిశా, కోస్తాంధ్ర పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో మూడు రోజులుగా కొనసాగిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. అయితే దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సీజన్లో 52.49 సెంటీమీటర్ల వర్షపాతం: ఏటా నైరుతి సీజన్లో 72.58 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. అందులో జూలై 14కి 22.66 సెంటీమీటర్లు కురవాలి. కానీ ఈసారి ఏకంగా 52.49 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. అంటే మొత్తం నైరుతి రుతుపవనాల కాలంలో కురిసే వర్షంలో మూడింట రెండొంతులు ఇప్పటికే కురిసినట్టు తెలిపింది. -
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం
విశాఖపట్నం : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరిత అవర్తనం ఏర్పడిందని తెలిపింది. మరో 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే రాగల 24 గంటల్లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.


