బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం | Low pressure area in bay of bengal | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం

Nov 7 2015 11:00 AM | Updated on Sep 3 2017 12:11 PM

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది.

విశాఖపట్నం  : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరిత అవర్తనం ఏర్పడిందని తెలిపింది. మరో 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే రాగల 24 గంటల్లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.
 

Advertisement
 
Advertisement
Advertisement