బంగాళాఖాతంలో వాయుగుండం | Deep Depression To Cross Odisha–West Bengal Coast, Coastal Andhra On High Alert | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో వాయుగుండం

Jul 27 2026 5:13 AM | Updated on Jul 27 2026 8:41 AM

Low-pressure area over Bay of Bengal intensifies into depression and heavy rain to lash Odisha

ఉత్తరాంధ్రకు ఈదురుగాలుల హెచ్చరిక

సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. సోమవారం మధ్యాహ్నానికి పారాదీప్‌–సాగర్‌ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ సమీపంలో తీరందాటే అవకాశాలున్నట్లు తెలిపింది.

ఉత్తరాంధ్రలో బలమైన గాలులు..
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55–65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు బుధ వారం వరకు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అత్యవసర హెచ్చరిక జారీచేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement