కర్నూలు: కర్నూలు నగరంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. జోహ్రాపురం రోడ్‌లో ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఓ బ్యాడ్మింటన్ అకాడమీలో పోటీలకు వచ్చి, కాల్పులకు పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పోటీలకు వచ్చి గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. కాల్పులకు పాల్పడ్డ వారు తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనంలో వచ్చినట్లు తెలుస్తోంది.


