విద్యార్థి షాకింగ్‌ నిర్ణయం.. రైలు కింద పడి.. | Vetapalem Tragedy: Train Student Incident In Bapatla District | Sakshi
Sakshi News home page

విద్యార్థి షాకింగ్‌ నిర్ణయం.. రైలు కింద పడి..

Oct 1 2026 3:08 PM | Updated on Oct 1 2026 3:31 PM

Vetapalem Tragedy: Train Student Incident In Bapatla District

సాక్షి, బాపట్ల జిల్లా: వేటపాలెంలో విషాదం జరిగింది. రైలు కింద పడి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన విద్యార్థి.. క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. మృతుడు హరి మాస్టార్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న షణ్ముఖ్‌గా గుర్తించారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు పోలీసులు తరలించారు.

మరో ఘటనలో..
గుంటూరు జిల్లా మోరంపూడి గ్రామానికి చెందిన వేమూరి ప్రభు కిరణ్‌ (7) అదృశ్యం కేసు విషాదంగా ముగిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామానికి చెందిన వేమూరి కిరణ్‌ కుమార్‌ కుమారుడు ప్రభు కిరణ్‌ సోమవారం ఆడుకోవడానికి వెళ్ళిన కుమారుడు కనిపించడం లేదని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్పందించిన ఎస్‌ఐ వెంకట రవి దర్యాప్తు చేపట్టగా బుధవారం ఉదయం చెరువులో ప్రభుకిరణ్‌ మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిర్వహించి వెంటనే తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో ‘ఇరుముడి’ సీన్‌ రిపీట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement