‘రౌడీషీట్ల’ ప్రొసీడింగ్స్‌ను ఎలా సమర్థించుకుంటారు? | High Court order to police for Rowdy sheets | Sakshi
Sakshi News home page

‘రౌడీషీట్ల’ ప్రొసీడింగ్స్‌ను ఎలా సమర్థించుకుంటారు?

Oct 1 2026 6:01 AM | Updated on Oct 1 2026 6:01 AM

High Court order to police for Rowdy sheets

అసలు ఏమనుకుంటున్నారో చెప్పండి 

పోలీసులకు హైకోర్టు ఆదేశం  

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై రౌడీషీట్లు తెరవాలంటూ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ఎలా సమర్థించుకుంటారని హైకోర్టు బుధవారం పోలీసులను ప్రశ్నించింది. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఎలా చెల్లుబాటు అవుతాయని నిలదీసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్‌ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన బచ్చు మురళీకృష్ణ మరికొందరు మంగళవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్‌ మహేశ్వరరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎస్‌.శ్రీరామ్, వేలూరు మహేశ్వరరెడ్డి తొలుత వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పిటిషనర్లపై రౌడీషీట్లు తెరుస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.  

వాదనల్లో మరిన్ని ముఖ్యాంశాలు
⇒ రౌడీషీట్లు ఎప్పుడు తెరవాలి.. ఎలా తెరవాలి.. అన్న విషయాలను పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ స్పష్టంగా చెబుతున్నాయి. ⇒ ఎవరిపైన అయితే రౌడీషీట్‌ తెరవాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తిపై ఉన్న కేసుల వివరా­లు, వాటి స్వభావం, ఆ వ్యక్తి పదే పదే నేరాలు చేస్తున్నారా? ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నా­రా? వంటి వివరాలతో స్థానిక పోలీసులు ఉన్న­తాధికారులకు ప్రతిపాదనలు పంపుతారు.  
⇒ అయితే ప్రస్తుత కేసులో మాత్రం అందుకు వి­రుద్ధంగా, కమిషనరే నేరుగా ఆదేశాలు ఇచ్చా­రు. ఇది పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు విరుద్ధం.  
⇒ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దా­డి చేశారన్న ఆరోపణలతో రౌడీషీట్లు తెర­వడం దారుణం.  
⇒ పిటిషనర్లకు ఎలాంటి నేర చరిత్ర లేదు. పదే పదే నేరాలు చేశారన్న ఆరోపణలు కూడా లేవు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement