టీడీపీ కాపు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆంక్షలు | CM Chandrababu Imposes Restrictions on TDP Kapu MLAs | Sakshi
Sakshi News home page

టీడీపీ కాపు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆంక్షలు

Jul 26 2026 8:08 PM | Updated on Jul 26 2026 8:10 PM

CM Chandrababu Imposes Restrictions on TDP Kapu MLAs

టీడీపీ కాపు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆంక్షలు విధించారు. కాపుల సమావేశాలను హాజరైనందుకు చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా కాపు ఎమ్మెల్యేలు పాల్గొనడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. కాపు సంఘాలు నిర్వహించిన ముద్రగడ సంస‍్మరణ సభకు బోండా ఉమ హాజరయ్యారు. బోండా ఉమ హాజరైనందుకు మొత్తం కాపు నేతలపై ఆంక్షలు విధించారు చంద్రబాబు.

టీడీపీ ఓటమికి ముద్రగడ ఉద్యమమే కారణమని బోండా ఉమ వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటిని ఆలింగనం చేసుకున్నారు బోండా ఉమ. బోండా ఉమ వ్యాఖ్యల నేపత్యంలో చంద్రబాబు ఆంక్షలు విధించారు. ఏ కులానికీ లేని ఆంక్షలు కాపులకేనా అంటూ టీడీపీ కాపు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement