మాజీ మంత్రి ఆర్‌కే రోజాపై కక్ష సాధింపు చర్యలు | Political Vendetta Against Former Minister RK Roja | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి ఆర్‌కే రోజాపై కక్ష సాధింపు చర్యలు

Jul 26 2026 8:05 PM | Updated on Jul 26 2026 8:05 PM

Political Vendetta Against Former Minister RK Roja

నగరి:  వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు నోటీసులిచ్చారు పోలీసులు.  చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు నోటీసులిచ్చారు తిరుపతి ఈస్ట్‌ పోలీసులు. ఈనెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

దీనిపై ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.  దీనిలో భాగంగా తనపై అక్రమ కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారన్నారు. 

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని,  ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు ఆర్‌కే రోజా. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement