breaking news
ayyappa devotee
-
Palani: మాల తెంచి అయ్యప్ప భక్తుడిపై దాడి
-
ఎయిర్‌పోర్టులలో గందరగోళం.. ప్రయాణికుల ఆగమాగం
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు.. ఇలా ప్రధాన నగరాల ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వకపోవడం.. వసతులు కల్పించడంలో విఫలం కావడంతో ఇండిగో తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విమాన సర్వీసుల రద్దు విషయంలో ఇండిగో తన చెత్త రికార్డు తానే బద్ధలు కొట్టుకుంది. ఇవాళ ఒక్కరోజే 600కి పైగా విమానాలను రద్దు చేసింది. ఇందులో ఒక్క ఢిల్లీలోనే 220 విమానాలు ఉండడం గమనార్హం. అలాగే ముంబైకి వెళ్లే 100 విమానాలను క్యాన్సిల్ చేసింది. ఇటు హైదరాబాద్‌లోనూ దాదాపు 80కిపైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. నేటి అర్ధరాత్రి దాకా ఈ రద్దు ఉంటుందని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.My IndiGo flight was cancelled today with zero proper communication and my checked-in luggage never came back. Hundreds stranded, families crying, people missing important commitments. This isn’t a “delay issue”, it’s a complete collapse of operations. Passengers deserve better. pic.twitter.com/dak5J7p7CI— Varun Kumar (@Varun2829) December 5, 2025ప్రయాణికుల తీవ్ర అవస్థలుసిబ్బంది కొరతే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలతో పైలెట్ల కొరత నెలకొంది. ఇండిగోతో పాటు ఇతర విమానయాన సంస్థలపైనా ఈ ప్రభావం పడింది. అయితే ఇండిగో దేశంలోనే అత్యధికంగా విమానాలు నడిపే సంస్థ కావడం, అప్పటికే అక్కడి సిబ్బంది కొరత ఉండడంతో ఎఫెక్ట్ ఈ స్థాయిలో కనిపిస్తోంది. इंडिगो की 500 फ्लाइट रद्द, एयरपोर्ट पर यात्री भड़के#Indigo #IndigoDelay #IndigoFlightsCancelled pic.twitter.com/f8coTKnWqk— Buland Bharat TV (@Bulandbharattv) December 5, 2025आज इंडिगो की 550 से ज़्यादा उड़ानें रद्द कर दी गईं। हज़ारों लोग रास्ते में फँसे हुए हैं, एक पिता अपनी बेटी के लिए सैनिटरी पैड की भीख माँगता हुआ दिखाई दिया। क्या हमारे पास कोई विमानन मंत्रालय भी है? मंत्री जी क्या कर रहे हैं?#Indigo #DGCA #IndigoDelay pic.twitter.com/uUpuAM5Dm8— Gems of Viral (@GemsofViral) December 5, 2025India’s air travel chaos deepens as new pilot safety rules and strict FDTL norms trigger mass IndiGo cancellations, long delays & stranded passengers nationwide. Crew shortages & regulatory pressure highlight India’s need for stronger aviation planning. Follow @bharat24by7 pic.twitter.com/bM9jz1EUwd— bharat24by7 (@Bharat24by7) December 5, 2025 ఈ ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విమానాలు ఎప్పుడు ఎగరతాయో.. తమను ఎప్పుడు తీసుకెళ్తారో అని ఎదురు చూస్తున్నారు. ఎయిర్‌పోర్టులలో తమకు సరైన సదుపాయాలు అందించడం లేదని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటు.. వాళ్లకు సరైన సమాచారం అందించలేక ఇండిగో క్షమాపణలు చెబుతోంది. వెరసి.. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులలో గందరగోళం కొనసాగుతోంది.ఇండిగో విమానాలు రద్దు కావడంతో.. అటు మిగిలిన విమాన సంస్థలు దోపిడీకి దిగాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టికెట్ ధరలను పెంచేశాయి. ఏకంగా 40వేలు ఛార్జ్ చేస్తున్నాయి.శంషాబాద్‌లో ఉద్రిక్తత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటల పాటు ఆలస్యం కావడంతో స్వాములు నిరసనకు దిగారు.షెడ్యూల్ ప్రకారం.. ఇండిగో విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు సాయంత్రమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, విమానం శుక్రవారం ఉదయానికి కూడా బయలుదేరాకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉన్నట్టు తెలిపారు. విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. గురువారం ఉదయం కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కేరళకు వెళ్లే ఇండిగో విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా విమానం రద్దు చేస్తారు?” అంటూ భక్తులు విమానాశ్రయ అధికారులను ప్రశ్నించారు. విమాన రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని లేదా ప్రత్యేక విమానాన్ని నడపాలని భక్తులు డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ అసౌకర్యం పెరగడంతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
పరమ పవిత్రం.. కార్తీక మాస విశేషాలివిగో
దీపావళి సంబరాలు ముగిశాయి. ఆ వెంటనే పవిత్ర కార్తీక మాసం హడావిడి మొదలైంది. శివ కేశవుల భక్తులంతా ఏంతో ఆసక్తిగా ఎదురు చూసే సమయమిది. ఈ పుణ్య మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1న సూర్యోదయ సమయంలో అమావాస్య ఘడియలు ఉన్నందున ఆ మరుసటి రోజు నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలనేది పండితుల మాట. శివనామస్మారణలతో ఆలయాలన్నీ మార్మోగుతాయి. వేకువ ఝామునే చన్నీటి స్నానాలు, దీపారాధన, శివరాధనలో భక్తులు పరవశిస్తారు.కార్తీకమాసం అంతా ధూప దీపాలు, శివనామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. శివాలయంలోనో మరేదైనా దీపం వెలగించడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగి పోతాయని భక్తులు నమ్ముతారు. కనీసం ఇంట్లో తులసికోటముందు దీపాలు వెలిగించినా పుణ్యం దక్కుతుందని భావిస్తారు. ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలు, మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు.ప్రత్యేకంగా మహిళలు నిష్టగా పూజలు చేస్తారు. దీపారాధనలు, ఉపవాస దీక్షలు, కార్తీకపురాణ పఠనం చేస్తూ శివకేశవులిద్దరనీ ఆరాధిస్తారు. ఈ పురాణంలో శివారాధన, దీపారాధన వైశిష్ట్యం, ఫలితాల గురించి విపులంగా ఉంటుంది. అలాగే శక్తి కొలదీ దానం చేయం, సాత్విక జీవనం లాంటి విషయాలతో పాటు, ఆరిపోతున్న దీపపు ఒత్తిని సరిచేసి, దీపాన్ని వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతుంది. నిష్టగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, ఉసిరి దీపాలు, దీపదానం చేస్తే నేరుగా స్వర్గానికి వెడతారని చెబుతుంది. అలాగే తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని కార్తీక పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వీటితో పాటు నాగుల చవితి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశితోపాటు, కార్తీకపూర్ణిమ ( నవంబర్ 15వతేదీ శుక్రవారం) రోజులు అతిపవిత్రమైనవి భక్తులు భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం. అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి సమీపంలోని నదులు,చెరువులలో వదిలే దృశ్యాలు కన్నుల పండువలా ఉంటాయి. అలాగే జ్వాలాతోరణం ఉత్సవం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.అయ్యప్ప దీక్షలు, పడిపూజలుకార్తీక మాసం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం. అయ్యప్పదీక్షలు కార్తీక మాసం నుంచి,మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాల ధారణ చేస్తారు. 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో దీక్షను కొనసాగిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు, నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తారు. స్వామి చింతనలో, సాత్విక జీవనాన్ని పాటిస్తారు. తెల్లవారుజామునే చన్నీటి స్నానం భజనలు, పూజలతో గడుపుతారు. దిండ్లు పాదరక్షలు కూడా వాడకుండా నేలపై పడుకుంటారు. బ్రాహ్మచర్యాన్ని పాటిస్తూ మండలం అనగా 41రోజులు పాటు ఈ నియమాలను భక్తి, శ్రద్ధలతో ఆచరిస్తారు. సంక్రాంతిలో రోజు మకర జ్యోతి దర్శనంతో దీక్షలను విరమిస్తారు. -
అయ్యప్ప భక్తుడిని ఢీకొట్టిన కేసుపై స్పందించిన భైరి నరేష్
-
అయ్యప్ప భక్తుడిని ఢీకొట్టిన బైరి నరేష్ వాహనం
-
నేను ఎక్కడికి పారిపోలేదు: బైరి నరేష్
సాక్షి, ములుగు: తాను ఎక్కడికి పారిపోలేదు.. ఎవరిపైనా దాడి చేయలేదని నాస్తికుడు బైరి నరేష్ అన్నారు. తాను దాడి చేశానన్న వార్తలో నిజం లేదన్నారు. కాగా, అయ్యప్ప భక్తుని కారుతో ఢీకొట్టిన ఘటనలో ఏటూరు నాగారం పీఎస్‌లో బైరి నరేష్‌పై కేసు నమోదైంది. అయ్యప్ప భక్తుడిని వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం మంగపేట వైపు వెళ్తుండగా నరేష్ వాహనం ప్రమాదానికి గురైంది. జీడివాగు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత వాహనం అక్కడే వదిలేసి నరేష్ బస్సులో వెళ్లిపోయారు. వాహనం ప్రమాదంపై మరో కేసు నమోదైంది. బైరి నరేష్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. బైరి నరేష్ స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు. ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్ అంగీకరించాడు. -
అయ్యప్ప దీక్షలో చేయవలసినవి మరియు చేయకూడనివి..!
-
బైరి నరేష్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు
-
రెండేళ్లుగా దైవదర్శనానికి దూరంగా.. అయ్యప్పా..
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప సన్నిధికి చేరేందుకు భక్తజన సందోహం పడిగాపులు కాస్తోంది. రెండేళ్లుగా దైవదర్శనానికి దూరంగా ఉన్న భక్తులు ఈసారి భారీ సంఖ్యలోనే మాలధారణ గావించారు. డిమాండ్‌కు తగిన రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒకటే అందుబాటులో ఉంది. ఈ ట్రైన్లో ఇప్పటికే ‘నో రూం’ దర్శనమిస్తోంది. మరోవైపు జంటనగరాల నుంచి ఆ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లన్నీ ఇప్పటికే భర్తీ అయ్యాయి. ఫిబ్రవరి వరకు అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప భక్తులు శబరికి వెళ్లడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈసారి ఎక్కువ మంది భక్తులు తరలి వెళ్లే అవకాశం ఉండడంతో ప్రైవేట్ వాహనాలు చార్జీల మోత మోగిస్తున్నాయి. ఉన్నది ఒక్కటే.. ► సాధారణంగా ప్రతి ఏటా కనీసం 2.5 లక్షల మందికి పైగా అయ్యప్ప భక్తులు హైదరాబాద్ నుంచి శబరికి వెళ్తారు. జనవరిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ కారణంగా భక్తుల సంఖ్య తగ్తింది. ఈసారి లక్ష మందికి పైగా మాలధారణ చేసినట్లు అంచనా. ప్రతి రోజు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడం వల్ల శబరికి వెళ్లే భక్తుల సంఖ్య కొంత మేరకు తగ్గవచ్చు. కానీ కనీసం 30 వేల మందికి పైగా భక్తులు వెళ్లే అవకాశం ఉంది. ► హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇది రెగ్యులర్ ట్రైన్. ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. మరో నెల రోజుల వరకు కనీసం టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు కూడా అవకాశం లేదు. ఈసారి ఇప్పటి వరకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. సంక్రాంతి ప్రయాణమూ కష్టమే.. ► ఈసారి సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రైళ్లలో ఫిబ్రవరి వరకు వెయింట్ లిస్టు 200 నుంచి 250 వరకు దాటింది. జనవరి, ఫిబ్రవరి నెలల కోసం అన్ని రైళ్లలో బెర్తులు భర్తీ అయ్యాయి. చాలామంది నిరీక్షణ జాబితాలో ఎదురు చూస్తున్నారు. ► విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్, తదితర ప్రాంతాలకు అదనపు రైళ్లు వేస్తే తప్ప ఊరెళ్లడం సాధ్యం కాదు. మరోవైపు జనవరి మొదటి వారానికే గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, నర్సాపూర్, ఫలక్‌నుమా, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, సింహపురి, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి, రాయలసీమ తదితర అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు 250 దాటిపోయింది. ప్రైవేట్ బస్సుల్లో చార్జీల మోత... ► రైళ్ల కొరత కారణంగా అయ్యప్ప భక్తులు, సంక్రాంతికి సొంత ఊరు వెళ్లే సాధారణ ప్రజలు సైతం ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహణాలపైన ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్‌లో చార్జీల మోత మోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. చదవండి: ‘బ్రెయిన్లో చిప్స్.. కళ్లల్లో కెమెరా అంటూ ’ -
అమెరికాలో అయ్యప్ప స్వాముల దీక్ష విరమణ
-
అయ్యప్ప మాల తీసేసి రావాలి..
సాక్షి, నర్సాపూర్: అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని అయ్యప్ప డ్రెస్సులో పాఠశాలకు రావద్దని ప్రిన్సిపాల్ హెచ్చరించడంతో తలెత్తిన వివాదం పాఠశాల డైరెక్టర్ క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగింది. నర్సాపూర్‌కు చెందిన శేఖర్ కుమారుడు ప్రసాద్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అతను గత నెల 17న అయ్యప్ప మాల ధరించి రోజూ స్కూలుకు వెళ్తున్నాడు. సోమవారం ప్రసాద్‌ను పాఠశాల ప్రిన్సిపాల్ మేఘన తన ఆఫీస్‌కు పిలిపించుకుని అయ్యప్ప మాల డ్రెస్ తీసేసి స్కూల్ యూనిఫాంలో రావాలని హెచ్చరించిందని అతని తండ్రి శేఖర్, అయ్యప్ప గురుస్వాములు రమేష్‌గౌడ్, అమర్నాథ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రాజేందర్ తదితరులు ఆరోపించారు. ప్రిన్సిపాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ వారు మంగళవారం పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ మేఘనను నిలదీశారు. పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. స్థానిక సీఐ నాగయ్య వచ్చి సముదాయించినా వారు వినకుండా పాఠశాల డైరెక్టర్లు రావాలని డిమాండు చేస్తూ ధర్నాను కొనసాగించారు. పాఠశాల డైరెక్టర్లు స్వరూప్‌రెడ్డి, నర్సిరెడ్డిలు ధర్నా చేస్తున్న వారి వద్దకు వచ్చారు. స్వరూప్‌రెడ్డి అయ్యప్ప మాలదారులతో మాట్లాడుతూ తమకు, తమ సిబ్బందికి ఎవరిని ద్వేషించే ఉద్దేశం లేదని ఈ ఘటనతో ఎవరైనా మనస్తాపానికి గురైతే మమ్మల్ని క్షమించాలని కోరారు. ప్రిన్సిపాల్ వ్యాఖ్యలను వివాదం చేయాలన్న ఉద్దేశం తమకు లేదని అయ్యప్ప దీక్షదారులు వివరిస్తూ ధర్నా విరమించి డైరెక్టర్ల ఆఫీసులోకి వెళ్లి కొంత సేపు వారితో మాట్లాడారు. ఇలాంటి తగాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక సీఐ నాగయ్య పాఠశాల డైరెక్టర్లకు సూచించారు. -
పది మంది అయ్యప్ప భక్తుల మృతి..
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తుల మృతి
తడ: రాష్ట్రానికి సరిహద్దు గ్రామమైన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పన్నంగాడు వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున వ్యాన్, లారీ ఢీకొన్నాయి. శబరిమల నుంచి అయ్యప్ప భక్తులతో తిరిగి వస్తున్న వ్యాన్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన రాజారావు (30), రాహుల్ (8) అనే భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరి కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని తమిళనాడులోని పొన్నెరీ ఆసుపత్రికి తరలించారు. -
అయ్యప్ప మాలధారుడిపై దాడి
ధర్మవరం రూరల్ : గొట్లూరులో సోమవారం రాత్రి శ్రీనివాసులు అనే అయ్యప్ప మాలధారుడిపై అదే గ్రామానికి చెందిన జగన్మోహన్రెడ్డి మద్యం మత్తులో దాడి చేశాడు. మాలను కూడా తెంచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.


