చంద్రగిరి: చంద్రగిరిలో రిగ్గింగ్ చేయడానికి ఎమ్మెల్యే పులివర్తి నాని కుట్ర పన్నారు. మంగళ ప్రాంతంలో ఉన్న పోలింగ్ బూతుల్లో భారీ ఎత్తున టీడీపీ గుండాలను మోహరించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధ రెడ్డి దౌర్జన్యాలు, గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. దీంతో పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు భయభభ్రాంతులకు గురయ్యారు.
చంద్రగిరి మండలం తిమ్మి నాయుడుపాలెం జీవకోన మంగళం ప్రాంతాల్లో భారీ రెగ్గింగ్ చేయడానికి తెలుగుదేశం గుండాలు భారీగా జనాలను మోహరించారు. బూతు దగ్గరకు 100 నుంచి 200 మంది తీసుకువచ్చారు. పోలీసులు తెలుగుదేశం పార్టీకి ఏజెంట్టుగా మారుతున్నారు. అలజడి సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మంగళంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బూత్‌లలోకి వెళ్ళనీయకుండా ఎమ్మెల్యే నాని అనుచరులు అడ్డుకున్నారు.


