విజయ్ జన నాయగన్.. త్రిష ఏ థియేటర్‌లో చూశారంటే? | Trisha arrives at Chennai theatre to watch Vijay Jana Nayagan | Sakshi
Sakshi News home page

Jana Nayagan: జన నాయగన్ రిలీజ్.. త్రిష ఏ థియేటర్‌కు వెళ్లారంటే?

Jul 23 2026 2:47 PM | Updated on Jul 23 2026 3:05 PM

Trisha arrives at Chennai theatre to watch Vijay Jana Nayagan

దళపతి విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా 'జన నాయగన్'. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఎ‍ట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.

జన నాయగన్ రిలీజ్‌ కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టైమ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన త్రిష కృష్ణన్‌ గురించి చర్చ మొదలెట్టారు. ఈ మూవీని చూసేందుకు ఆమె చెన్నైలోని రోహిణి థియేటర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా జన నాయగన్ మూవీ ఆమె వీక్షించారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కోలీవుడ్‌లో త్రిష పేరు మార్మోగిపోయింది. 

గతంలో త్రిష, విజయ్ పలుమార్లు కలిసి తెరపై జంటగా కనిపించారు. వీరిద్దరు తొలిసారిగా 2004లో 'గిల్లి' చిత్రంలో నటించారు. ఆ తర్వాత 'తిరుపాచి', 'ఆతి', 'కురువి' చిత్రాల్లో మెప్పించారు. 2023లో విడుదలైన 'లియో' చిత్రంలో వీరిద్దరూ చివరిసారిగా కలిసి కనిపించారు. విజయ్ నటించిన 'గోట్' చిత్రంలో త్రిష అతిథి పాత్రలో కూడా కనిపించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement