సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా | Carmeni Selvam Movie Now Streaming On This OTT | Sakshi
Sakshi News home page

Carmeni Selvam OTT: ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. ఓటీటీలో స్ట్రీమింగ్

Jun 3 2026 10:22 AM | Updated on Jun 3 2026 12:27 PM

Carmeni Selvam Movie Now Streaming On This OTT

తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువగా వస్తాయి. తమిళ, మలయాళంలో మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అలా రెండు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ మూవీ.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్.. 'మధువిధు' తెలుగు రివ్యూ)

తెలుగులోనూ అల వైకుంఠపురములో, క్రాక్ తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని లీడ్ రోల్ చేసిన తమిళ మూవీ 'కార్మేని సెల్వం'. గౌతమ్ మేనన్ మరో కీలక పాత్ర చేశారు. ఏప్రిల్ 3న థియేటర్లలో తెలుగులోనూ రిలీజైన ఈ చిత్రం.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలంటే ఇష్టముంటే దీనిపై లుక్ వేయొచ్చు.

'కార్మేని సెల్వం' విషయానికొస్తే.. సెల్వం(సముద్రఖని).. సంపత్(గౌతమ్ మేనన్) దగ్గర కారు డ్రైవరుగా పనిచేస్తుంటాడు. సెల్వం భార్య శాంతి (లక్ష్మి) ఇడ్లీ బండి నడుపుతూ ఉంటుంది. చాలా డబ్బు సంపాదించి సొంతిల్లు కట్టుకోవాలన్నది సెల్వం దంపతుల కల. దీనికోసం రోజూ కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. ఓ సందర్భంలో బంధువులే వీళ్లని తీవ్రంగా అవమానిస్తారు. తర్వాత అనుకోని సంఘటనలు జరుగుతాయి. దీంతో సెల్వం.. తన యజమాని సంపత్‌ని మోసం చేస్తాడు. తర్వాత అంతకుమించి అప్పులు కూడా చేస్తాడు. వాటిని తీర్చే క్రమంలో సెల్వం కుటుంబం ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

మరోవైపు ఓటీటీలో ఈ వారం ధురంధర్ 2, పేట్రియాట్, కేడీ, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక.. లాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement