breaking news
Gautam Vasudev Menon
-
'ఏ మాయ చేశావే నాగచైతన్యతో కాదు.. ఆ స్టార్ హీరోతో చేయాలని': డైరెక్టర్
ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచింది. నాగచైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ సమంత ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. అయితే మొదటి ఏ మాయ చేశావే చిత్రానికి హీరోగా నాగచైతన్యను అనుకోలేదని తెలిపారు. స్టార్ హీరో మహేశ్ బాబుతోనే తీద్దామని ఈ కథను రాసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో చిరంజీవి గెస్ట్ రోల్‌గా పెట్టాలని అనుకున్నట్లు గౌతమ్ వాసుదేవ్ తెలిపారు. క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్‌తో ప్లాన్ చేశానని పేర్కొన్నారు.కాగా.. జూలై 18న 'ఏమాయ చేసావె' రీ రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో 'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది. Gautam Vasudev Menon explaining how the #YMC story developed keeping Mahesh babu @urstrulyMahesh in mind , and initial climax he planned was different planning to cast Chiranjeevi as guest role pic.twitter.com/iC2gXj3uhu— #Coolie varaaru 🌟 (@yourstrulyvinay) July 1, 2025 -
మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్.. 'బజూక' ట్రైలర్ వచ్చేసింది!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తోన్న తాజా చిత్రం బజూక. డినో డెన్సిస్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్లో మమ్ముట్టి యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు.ట్రైలర్లో ఫైట్స్ సీక్వెన్స్, మమ్ముట్టి యాక్షన్ చూస్తుంటే అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. అజిత్ మూవీతో మమ్ముట్టి బజూక సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది. -
ఏమాయ చేసావేకి’ నెక్ట్స్ లెవల్
నాగచైతన్య, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేశావె’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. మంజిమా మోహన్ కథానాయిక. మిర్యా సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ -‘‘ ‘ఏమాయ చేసావే’ నెక్ట్స్ లెవల్ మూవీ ఇది. ఆ చిత్రంలోని అబ్బాయి మగాడు అయిన తర్వాత అతడి ప్రవర్తన ఎలా ఉంటుందన్నది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. ‘‘గౌతమ్ మీనన్‌గారి దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నా. నన్ను సరికొత్త స్టయిల్లో చూపిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అని నాగచైతన్య చె ప్పారు. నిర్మాతలు ‘దిల్’రాజు, బెల్లంకొండ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.