మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్‌.. 'బజూక' ట్రైలర్ వచ్చేసింది! | Malayalam Megastar Mammootty Bazooka Trailer Out Now | Sakshi
Sakshi News home page

Bazooka Trailer: మమ్ముట్టి 'బజూక'.. యాక్షన్ థ్రిల్లర్‌ ట్రైలర్ వచ్చేసింది!

Mar 26 2025 9:11 PM | Updated on Mar 26 2025 9:22 PM

Malayalam Megastar Mammootty Bazooka Trailer Out Now

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తోన్న తాజా చిత్రం బజూక. డినో డెన్సిస్‌ దర్శకత్వంలో  ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో మమ్ముట్టి యాక్షన్ ‍సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు.

ట్రైలర్‌లో ఫైట్స్ సీక్వెన్స్, మమ్ముట్టి యాక్షన్ చూస్తుంటే అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున అజిత్‌ కుమార్‌ గుడ్‌ బ్యాడ్‌ ‍అగ్లీ సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. అజిత్ మూవీతో మమ్ముట్టి బజూక సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement