
ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. నాగచైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ సమంత ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. అయితే మొదటి ఏ మాయ చేశావే చిత్రానికి హీరోగా నాగచైతన్యను అనుకోలేదని తెలిపారు. స్టార్ హీరో మహేశ్ బాబుతోనే తీద్దామని ఈ కథను రాసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో చిరంజీవి గెస్ట్ రోల్‌గా పెట్టాలని అనుకున్నట్లు గౌతమ్ వాసుదేవ్ తెలిపారు. క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్‌తో ప్లాన్ చేశానని పేర్కొన్నారు.
కాగా.. జూలై 18న 'ఏమాయ చేసావె' రీ రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో 'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది.
Gautam Vasudev Menon explaining how the #YMC story developed keeping Mahesh babu @urstrulyMahesh in mind , and initial climax he planned was different planning to cast Chiranjeevi as guest role pic.twitter.com/iC2gXj3uhu
— #Coolie varaaru 🌟 (@yourstrulyvinay) July 1, 2025