
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'గుర్రం పాపిరెడ్డి'. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. ఈ మూవీని డార్క్ కామెడీ కథగా దర్శకుడు మురళీ మనోహర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా.. లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ పాడారు. కృష్ణ సౌరభ్ ఈ సాంగ్ను కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమకాు కృష్ణ సౌరభ్ సంగీతమందిస్తున్నారు.