కిరణ్ అబ్బవరం కె ర్యాంప్‌.. రొమాంటిక్ లవ్ సాంగ్‌ వచ్చేసింది! | Kiran Abbavaram Kalale Kalale Lyrical song Out Now | Sakshi
Sakshi News home page

K Ramp Movie: కిరణ్ అబ్బవరం కె ర్యాంప్‌.. రొమాంటిక్ సాంగ్‌ వచ్చేసింది!

Sep 9 2025 7:26 PM | Updated on Sep 9 2025 8:02 PM

Kiran Abbavaram Kalale Kalale Lyrical song Out Now

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ పతాకాలపై రాజేశ్‌ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్‌ 18న విడుదల కానుంది.

తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. చైతన్‌ భరద్వాజ్‌ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌ను కపిల్‌ కపిలన్‌ ఆలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement